కడప: అమరావతి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు పురంధేశ్వరి. హైదరాబాద్‌ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి జరగకూడదని సూచించారు. కడప జిల్లాలో పర్యటించిన పురంధేశ్వరి అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని చెప్పుకొచ్చారు. 

ఏపీ సీఎం వైయస్ జగన్ సైతం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని చెప్తున్నారు. తాజాగా పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు జగన్ నిర్ణయాలకు పరోక్షంగా మద్దతు పలికినట్లు అయ్యింది. ఏపీలో బలమైన శక్తిగా బీజేపీ ఎదగడం ఖాయమని పురంధేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. 

బీజేపీకి దేశవ్యాప్తంగా పోటీ ఇవ్వగలిగే పార్టీ కాంగ్రెస్ అని అయితే అది కూడా ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు. రాహుల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే వయోభారంతో బాధపడుతున్న సోనియాగాంధీని పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఈ సందర్బంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఇచ్చిందని తెలిపారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఆ నిధులను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. రాజధాని నిర్మాణం అంశం రాష్ట్ర ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. నిధులు ఖర్చు చేశాక రాజధాని మార్పు చేయాలనుకోవడం భావ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

నేనెప్పుడూ అలా అనలేదు, అన్నీ తెలుసుకుని మాట్లాడాలి: బొత్సకు పవన్ వార్నింగ్

అవసరమైతే ప్రధానిని కలుస్తా, అమరావతి ప్రజారాజధాని: పవన్ కళ్యాణ్

రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన, రైతులతో సమావేశంకానున్న జనసేనాని

అమరావతిలో భూములు లేవు.. ఆధారాలుంటే కేసులు పెట్టుకోండి: సుజనా చౌదరి

అంతా గందరగోళంగా ఉంది.. వెయిట్ అండ్ సీ: అమరావతిపై బొత్స వ్యాఖ్యలు

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా