అమరావతి: అమరావతిలో రాజధాని వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రాజధాని వద్దంటూ తాను అన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

తాను అమరావతిలో రాజధానిని వ్యతిరేకించలేదన్నారు. కానీ రాజధాని భూ సేకరణను మాత్రమే తాను అప్పట్లో వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. ఈ విషయాలను మంత్రి బొత్స సత్యనారాయణ తెలుసుకోవాలని సూచించారు. 

రాజధానిపై వ్యాఖ్యానించేటప్పుడు అన్ని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని చురకలంటించారు. ఇకపోతే రాజధాని ప్రాంతంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారం పర్యటించారు. నిడమర్రు, కొండవీటివాగు, దొండపాడు వంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు.  

రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఎవరూ అడ్డుకోరన్నారు. మంత్రులు ఏపీ ప్రభుత్వంగా మాట్లాడాలే తప్ప పార్టీ పరంగా మాట్లాడకూదన్నారు.  

ప్రభుత్వ పరంగా వాళ్లు ఆలోచిస్తే నిర్ణయాలు వేరుగా ఉండేవన్నారు. అమరావతిని అందరి రాజధానిగా చేయాలనే  సంకల్పంతో ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని సూచించారు. 

రాష్ట్ర విభజనతో ఇప్పటికే నష్టపోయామని మళ్లీ ఇలాంటి గందరగోళమైన నిర్ణయాలతో మరింత నష్టం చేకూరుతుందన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే తాము బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

అవసరమైతే ప్రధానిని కలుస్తా, అమరావతి ప్రజారాజధాని: పవన్ కళ్యాణ్

రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన, రైతులతో సమావేశంకానున్న జనసేనాని

అమరావతిలో భూములు లేవు.. ఆధారాలుంటే కేసులు పెట్టుకోండి: సుజనా చౌదరి

అంతా గందరగోళంగా ఉంది.. వెయిట్ అండ్ సీ: అమరావతిపై బొత్స వ్యాఖ్యలు

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా