తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో తవ్వేకొద్ది మరిన్ని అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. అనేక అంశాల్లో విలువ పెంచి చూపించి కుంభకోణానికి తెరదీసినట్లుగా తేలింది. దాదాపు రూ.80 కోట్ల పైచిలుగా స్కామ్ జరిగినట్లుగా తెలుస్తోంది.

రూ.11 విలువ చేసే గ్లూకోజ్ ఎనలైజర్ స్ట్రిప్ప్‌ను రూ.62గా.. అలాగే సోడియం పోటాషియం ఎలక్ట్రోడ్‌ల ధరలను భారీగా పెంచేసి రూ.44 వేలు చొప్పున చెల్లింపులు చేసినట్లుగా విజిలెన్స్ దర్యాప్తులో తేలింది.

Also Read:నా పేరు ఎక్కడా లేదు, ఏ విచారణకైనా సిద్ధం: ఈఎస్ఐ స్కామ్ పై పితాని

రూ.90 ర్యాపిడ్ టెస్ట్ కిట్‌కు రూ.190... రూ.25 థైరాయిడ్ (1ఎంజీ) కిట్‌కి రూ.93.. రూ.115 షుగర్ టెస్ట్ కిట్‌కి.. రూ.330 చెల్లించారు. అంతేకాకుండా మూడు కంపెనీలతో గత ప్రభుత్వంలోని మంత్రులు కుమ్మక్కయ్యారని విజిలెన్స్ నివేదిక బయటపెట్టింది. 

అవెంతార్, లెజెండ్, ఓమ్నీలకు కాంట్రాక్టులు కేటాయించేలా చర్యలకు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. డైరెక్టరేట్‌లో తిష్టవేసిన సప్లై కంపెనీల ప్రతినిధులు చక్రం తిప్పారు. అదే సమంలో సరకు సరఫరా కాకుండానే చాలా బిల్లులను పర్చేజ్ ఆఫీసర్లు చెల్లించేశారు.

Also Read:మోడీ ఆదేశాల మేరకే, విచారణ చేసుకోవచ్చు: ఈఎస్ఐ కుంభకోణంపై అచ్చెన్నాయుడు

కనీసం ఆసుపత్రులకు వెళ్లకుండానే పలు బిల్లులను చెల్లించారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండానే బిల్లులపై డైరెక్టర్లు సంతకాలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ మూడు కంపెనీలు రూ.85 కోట్లు కొల్లగొట్టాయని విజిలెన్స్ బయటపెట్టింది.

అలాగే కరికి హెయిర్ ఆయిల్‌ పేరుతోనూ కోట్ల రూపాయలను దోపిడీ చేశారని, అవసరం లేని గ్లెన్ మార్క్ ఆయిల్‌ను అధికారులు కొనుగోలు చేశారని తేల్చింది. 3 నెలల్లో ఎక్స్‌పైర్ అయ్యే వాటిని తెచ్చి స్టోర్స్‌లో ఉంచడంతో పాటు ఎక్స్‌పైర్ అయిపోయే ఆయిల్స్ పేరుతోనూ రూ.40 కోట్లకు పైగా గోల్‌మాల్ చేశారు.