అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈఎస్ఐ స్కామ్ పై మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యనారాయణ స్పందించారు. ఈఎస్ఐ స్కామ్ లో తన పాత్ర ఉందనే విషయాన్ని ఆయన వ్యతిరేకించారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ఆయన శనివారం మీడియాతో అన్నారు. 

విజిలెన్స్ నివేదికలో తన పేరు లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి జయరాం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. నిజాలు వెలికి తీస్తే తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. 

Also Read: ఏపీ ఈఎస్ఐలో భారీ స్కాం: తెర మీదికి అచ్చెన్నాయుడు పేరు

తమ ప్రభుత్వ హయాంలోని విజిలెన్స్ నివేదికలను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. డైరెక్టర్లపై విచారణ చేయాలని తానే ఆదేశించినట్లు ఆయనయ తెలిపారు. తనకు తెలియకుండా కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారని ఆయన చెప్పారు.

ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ నివేదిక తెలిపింది. ఈ స్కామ్ లో గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ పాత్రలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను అచ్చెన్నాయుడు ఇది వరకే ఖండించారు. తాజాగా పితాని సత్యనారాయణ ఆ ఆరోపణలపై స్పందించారు.

Also Read: పితానిని తాకిన ఈఎస్ఐ స్కాం :టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ