బోటు టీడీపీ నేతదే, అందులో చంద్రబాబు కూడా ప్రయాణించారు: మంత్రి అవంతి శ్రీనివాస్

తనకు బోటు వ్యాపారాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారని అదంతా కేవల దుష్ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు. బోటు బాధితులకు ప్రభుత్వమే నష్టపరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. 

ap tourism minister avanthi srinivas comments on boat accident

విశాఖపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. బోటు ప్రమాదంపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

బోటు నిర్వాహకుడు కోడిగుట్ల వెంకటరమణ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బోటుకు అనుమతి వచ్చినట్లు అవంతి స్పష్టం చేశారు. 

ఇకపోతే గోదావరిపుష్కరాల సమయంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదానికి గురైన శ్రీవశిష్ఠ పున్నమి రాయల్ టూరిస్ట్ బోటులోనే ప్రయాణించారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ వాళ్లు బోటును ప్రారంభించి అందులో పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రయాణించారని తీరా తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

తనకు బోటు వ్యాపారాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారని అదంతా కేవల దుష్ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు. బోటు బాధితులకు ప్రభుత్వమే నష్టపరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్లతో బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

గోదావరిలో బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

బోటు ప్రమాద నిందితుల అరెస్ట్: ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios