మంగళవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. 2015-16 తో పోలిస్తే 2016-17లో రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ఉదయ్ స్కీం మార్గదర్శకాల ప్రకారం డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందుకు  ఖర్చు చేయడమే అని Nirmala Sitharaman చెప్పారు.  

ఢిల్లీ : Andhrapradesh కు సంబంధించి 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆదాయాన్ని వాస్తవికంగా అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనట్టు Union Finance Minister నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. Revenue expenditure నియంత్రించలేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం కాలావధి మొత్తంతో పాటు, 15వ ఆర్థిక సంఘం పరిధిలోని 2020-21లో రెవెన్యూ లోటు గ్రాంట్ మంజూరు చేసినా ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ లోటు లో పెరుగుదల కనిపించినట్లు ఆమె పేర్కొన్నారు. 

మంగళవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. 2015-16 తో పోలిస్తే 2016-17లో రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ఉదయ్ స్కీం మార్గదర్శకాల ప్రకారం డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందుకు ఖర్చు చేయడమే అని Nirmala Sitharaman చెప్పారు.

2019-20లో బడ్జెట్ లో పేర్కొన్న రూ.1,779 కోట్లకు మించి రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, ఉచిత విద్యుత్తు లాంటి పథకాలేనని నిర్మలాసీతారామన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021- 22 వరకు గత ఎనిమిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు పన్నుల వాటా కింద మొత్తం రూ. 4,40,985 కోట్ల ఆర్థిక వనరులు అందించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు.

2014-15 నుంచి 2021- 22 వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి బదిలీ అయిన ఆర్థిక వనరులు ఇలా ఉన్నాయి…

వివరం రూ. కోట్లు
పన్నుల్లో వాటా 2,04,882
గ్రాంట్లు 2,22,010
రుణాలు, అడ్వాన్సులు 14,093
మొత్తం 4,40,985


ఆర్థిక సంఘాల అంచనాలు (రూ.కోట్లలో)
ఆరేళ్ల పన్ను ఆదాయ అంచనా 4,00,698
వాస్తవంగా వచ్చిన ఆదాయం 3,06,583
లోటు 94,115

పన్నేతర ఆదాయం అంచనా 76,043
వాస్తవంగా వచ్చింది 24,947
లోటు 51,096

ఆరేళ్ల రెవెన్యూ వ్యయం అంచనా 7,10,594
వాస్తవంగా జరిగిన రెవెన్యూ వ్యయం 7,52,413
పెరిగిన వేయం 41,819

 ఆరేళ్లవడ్డీ భారం అంచనా 83,319
 వాస్తవ భారం 90,414
 పెరిగిన వ్యయం 41,819

 పింఛన్ల వ్యయం అంచనా 83,235
 వాస్తవ వ్యయం 87,530
 పెరిగిన భారం 4,295

 పన్నువాటా పంచిన తర్వాత 
రెవెన్యూ లోటు అంచనా 28,009
 వాస్తవంగా తలెత్తిన రెవెన్యూ లోటు 1.15,951
 పెరిగిన రెవెన్యూ లోటు 87,942