అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశచరిత్రలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. వైయస్ జగన్ ఆశించినట్లుగానే రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. 

రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా తొలి టెండరింగ్ తోనే జగన్ గ్రాండ్ సక్సెస్ సాధించారు. తొలిటెండర్ లో రూ.58 కోట్లు ఆదా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించని రీతిలో ఫలితం రావడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళ్తే పోలవరం ప్రాజెక్టులో భాగంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ కనెక్టివిటీ పనులకు చెందిన 65వ ప్యాకేజి పనికి టెండర్ లను ఆహ్వానించింది ప్రభుత్వం. అయితే అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు అంటే మొత్తం పని విలువలో 58 కోట్ల తక్కువకు మ్యాక్స్ ఇన్ ఫ్రా అనే సంస్థ ఎల్-1గా బిడ్ దాఖలు చేసింది. 

గత టిడిపి ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని రూ.292.09 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించగా దానిని సీఎం వైయస్ జగన్ రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజీకి చెందిన పనులను రివర్స్ టెండరింగ్ కు ఆదేశించారు సీఎం జగన్. 

అయితే గత ప్రభుత్వంలో టెండర్ దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ రివర్స్ టెండరింగ్ లోనూపాల్గొని 15.60శాతం కంటే తక్కువగా కోడ్ చేసింది. దాంతో రూ.231 కోట్లకు బిడ్డింగ్ దాఖలు చేసినట్లు తెలిసింది.  

కేవలం మూడు వందల కోట్ల విలువ చేసే టెండర్లలోనే సుమారు రూ.58 కోట్లు ఆదా రావడంతో భవిష్యత్ లో మరిన్ని టెండర్లలో మరింత ఆదాయం వచ్చే అవకావశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

హైడల్, హెడ్ వర్క్స్ కు సంబంధించిన పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ జరగనుంది. సాధారణంగా ఎల్-1గా వచ్చిన సంస్థకు పనిని అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. అయితే రివర్స్ టెండరింగ్లో ఎల్-1గా వచ్చిన సంస్థ ధరను బేసిక్ బెంచ్ మార్క్ గా ప్రకటించి దాని ఆధారంగా మరింత తక్కువకు సంస్థలు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 

దాంతో తొలుత పిలిచిన 65వ ప్యాకేజీలోని పనికి 15.6 శాతం తక్కువకు మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ బిడ్డుంగు దాఖలు చేసింది. మిగిలిన సంస్థకన్నా ఇది బాగా తక్కువ కావడంతో ఈ సంస్థకు పనిని అప్పగించనుంది. 

శుక్రవారం ఉదయం 11 గంట నుంచి ఈ-ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఈ రివర్స్ టెండరింగ్ లో ఆరు సంస్థలు పోటీపడ్డాయి. రెండు గంటల 45 నిమిషాల పాటు ఈ-ఆక్షన్ నిర్వహించారు. అత్యంత తక్కువకు బిడ్ వేసిన సంస్థ అర్హతలను పరిశీలించి పనులు అప్పగించే అవకాశం ఉంది. 

దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇదే తొలిసారి. ఇందులో ఆరు బడా సంస్థలు పోటీపడటాన్ని బట్టి చూస్తే కాంట్రాక్టు విలువ కంటే అత్యంత తక్కువ ధరకు టెండర్ ఖరారయ్యే అవకాశం ఉంది. 

ఈ వార్తలు కూడా చదవండి

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్