సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్
పోలవరం ప్రాజెక్టు విషయంలో వరివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 17వ తేదీన పోలవరం ప్రాజెక్టు టెండర్లను పిలవనున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ప్రకటించినా కూడ ప్రభుత్వం మాత్రం ముందడుగు వేయాలని భావిస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వ హాయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకొన్న నిర్ణయాల కారణంగాఅనేక అవకతవకలు చోటు చేసుకొన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడ పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు చోటు చేసుకొన్నాయని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకొంది.
ఈ నెల 17వ తేదీన రివర్స్ టెండరింగ్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. హెడ్ వర్క్స్ లో ఇప్పటివరకు చేపట్టిన పనులు కాకుండా మిగిలినవాటితో పాటు హైడల్ ప్రాజెక్టుకు కలిపి టెండర్లు పిలవనున్నారు. మొత్తం రూ. 5070 కోట్ల పనులను రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.
మూడు రోజుల క్రితం హైద్రాబాద్‌లో సమావేశమైన పోలవరం అథారిటీ సమావేశమైంది. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు వ్యయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అథారిటీ అభిప్రాయపడింది.
అంతేకాదు ప్రాజెక్టు నిర్మాణం మరింతగా ఆలస్యం కానుందని పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ అభిప్రాయపడ్డారు.రివర్స్ టెండరింగ్ వల్ల నష్టమనే విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి చెప్పినట్టుగా కూడ ఆర్కే జైన్ మీడియాకు వివరించారు.
సంబంధిత వార్తలు
రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
జైన్ షాక్: జగన్ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు