Asianet News TeluguAsianet News Telugu

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో హైకోర్టు ఉత్తర్వుల తర్వాతే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

irregation officers plans to upload polavaram reverse tender schedule after september 4
Author
Amaravati, First Published Aug 29, 2019, 7:05 AM IST


అమరావతి:పోలవరం ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. రివర్స్ టెండరింగ్ పనులపై ముందుకు వెళ్లకూడదని ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజ,న్ బెంచ్ ను ఏపీ సర్కార్ ఆశ్రయించింది. ఈ కేసు విచారణను హైకోర్టు సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, జల విద్యుత్ ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండర్లను ఈ నెల 17న ఆహ్వానిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రివర్స్ టెండర్లను పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యతిరేకించింది. ఈ విషయమై పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ ఏపీ ప్రభుత్వానికి ఈ నెల 16న లేఖ రాసిన విషయం తెలిసిందే.

పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులకు సంబంధించి ఇంకా టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ టెండర్ల షెడ్యూల్ ఇంకా ఆన్‌లైన్ లో అప్ లోడ్ కాలేదు. టెక్నికల్ సమస్యల వల్లే టెండర్ షెడ్యూల్ ను ఆన్‌లైన్ లో అప్ లోడ్ చేయలేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. 

జల విద్యుత్ ప్రాజెక్టు పనుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ టెండర్లను అప్ లోడ్ చేయలేదు. కానీ., ఈ టెండర్లను అప్ లోడ్ చేసేందుకు జెన్ కో అన్ని రకాల ఏర్పాట్లను చేసింది.

పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం నవయుగ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఈ ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేస్తూ రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. దీంతో నవయుగ కంపెనీ ఈ నెల 20వ తేదీన హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ నవయుగ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ పై సెప్టెంబర్ 4వ తేదీన విచారణ చేయనుంది.

పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రివర్స్ టెండర్లకు సంబంధించి నోటిఫికేషన్ రెడీ చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విడి విడిగా ఇచ్చేందుకు కూడ నీటిపారుదల శాఖాధికారులు ప్రణాళికలను సిద్దం చేసుకొంటున్నారు.

ఈ విషయమై హైకోర్టు డివిజన్ బెంచ్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల తర్వాతే ఇరిగేషన్ అధికారులు పోలవరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. 

సంబంధిత వార్తలు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

Follow Us:
Download App:
  • android
  • ios