సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ పనులను ఏపీ సర్కార్ ఆహ్వానించింది. పోలవరం పనుల్లో జగన్ సర్కార్ పీపీఏ సీఈఓ సూచలను కూడ పట్టించుకోలేదు.

jagan government invites reverse tendering on polavaram project

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జగన్ సర్కార్ ముందడుగు వేసింది. రివర్స్ టెండరింగ్  వల్ల  నష్టమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ సూచనను కూడ లెక్క చేయలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు రివర్స్ టెండర్లను ఏపీ ప్రభుత్వం శనివారం నాడు పిలిచింది.

పోలవరం హెడ్ వర్క్స్,  జలవిద్యుత్ కేంద్రాల్లో పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచింది. రూ. 4,900 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. హెడ్ వర్క్స్‌కు  రూ. 1800 కోట్లు, జల విద్యుత్ పనులకు 3100 కోట్లకు టెండర్లను పిలిచారు.

పోలవరం ప్రాజక్టు నిర్మాణ పనుల్లో  రివర్స్ టెండరింగ్ వల్ల నష్టమని పీపీఏ  సీఈఓ లేఖ రాశాడు. ఈ లేఖను కూడ ఖాతరు చేయకుండా  రివర్స్ టెండరింగ్ కు  ఏపీ సర్కార్  శనివారం నాడు టెండర్లను ఆహ్వానించింది.

2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండర్లను ఆహ్వానించారు. చంద్రబాబు సర్కార్ ఈ ప్రాజెక్టు విషయంలో  ప్రజా దనాన్ని దుర్వినియోగం చేసిందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా ఆచరణలో చూపెట్టనున్నట్టుగా వైఎస్ఆర్ సీపీ నేతలు చెబుతున్నారు.

పీపీఏల రద్దు విషయంలో కూడ కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేసినా కూడ ఏపీ సర్కార్ పీపీఏలను రద్దు చేసింది. పీపీఏల తరహాలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో  రివర్స్ టెండరింగ్ విధానానికే జగన్ సర్కార్ మొగ్గు చూపింది.

 

సంబంధిత వార్తలు

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios