Asianet News TeluguAsianet News Telugu

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

పోలవరం ప్రాజెక్టు టెండరింగ్ విధానంపై వైఎస్  జగన్ సర్కార్  ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారోననే ఉత్కంఠ నెలకొంది.

what will jagan government next step on reverse tendering in polavaram
Author
Amaravathi, First Published Aug 17, 2019, 3:15 PM IST

అమరావతి: రివర్స్ టెండరింగ్ వల్ల నష్టమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శనివారం నాడు నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడంతో ఏం చేయాలనే విషయమై ఏపీ సర్కార్ ఏం చేస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

  పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్ వల్ల నష్టమేనని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ఆర్ కే జైన్ స్పష్టం చేశారు. అమెరికా టూర్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ఆర్ కె జైన్ లేఖ విషయాన్ని ఇరిగేషన్ అధికారులు ఏపీ సీఎం వైఎస్ జగన్  దృష్టికి తీసుకెళ్లారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ లేఖ విషయమై ఏం చేయాలనే దానిపై ఇరిగేషన్ అధికారులు న్యాయ నిపుణులతో చర్చించారు.రివర్స్ టెండరింగ్ విషయమై ఇప్పటికే ఏపీ సర్కార్  శుక్రవారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది.

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వద్దని  కూడ పీపీఏ సీఈఓ  ఆర్కే జైన్ ప్రకటించారు. రివర్స్ టెండరింగ్ చేపడితే ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడ ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు  నిర్మాణాల విషయంలో  రివర్స్ టెండరింగ్ విషయంలో ఏం చేస్తారోననే ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు

Follow Us:
Download App:
  • android
  • ios