అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దు చెల్లదన్న కోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుపై శనివారం సాయంత్రం ఐదు గంటలకు జరిగే సమీక్షా సమావేశంలో ఆ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోలవరం, హైడల్ పనులపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తారు. 

జగన్ అమెరికా పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన అత్యవసరంగా సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఈ సమావేశంలో చర్చించనున్నారు. తిరుమలలో బస్సు టికెట్లపై అన్యమత ప్రచారంపై కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. 

పోలవరంపై, వరద పరిస్థితులపై జగన్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. తిరుమలలో వివాదానికి కారణమైన అన్యమత ప్రచారం వ్యవహారంపై మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రికి వివరిస్తారు. ఈ వివాదంపై తలపెట్టిన మీడియా సమావేశాన్ని నాని రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రికి వివరాలు అందించిన తర్వాత ఆయన సూచనలు, సలహాల మేరకు మీడియాతో నాని మాట్లాడే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతోనే ఆయన మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు