Asianet News TeluguAsianet News Telugu

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విధానంపై నవయుగ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం నాడు మధ్యాహ్నం హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేయనుంది.

navayuga company files petition in high court on polavaram reverse tendering
Author
Amaravathi, First Published Aug 20, 2019, 1:26 PM IST | Last Updated Aug 20, 2019, 1:26 PM IST


అమరావతి: పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయడంపై నవయుగ కంపెనీ మంగళవారం నాడు హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 17వ తేదీన పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లను ఆహ్వానించింది.దీంతో హైకోర్టులో నవయుగ కంపెనీ పిటిషన్ వేసింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చంద్రబాబునాయుడు సర్కార్ అవకతవకలకు పాల్పడిందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. 

పోలవరం  ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయకూడదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. రివర్స్ టెండరింగ్ విదానం వల్ల నష్టమని  కూడ పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్  ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

కానీ ప్రభుత్వం మాత్రం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. పాత టెండర్ ను రద్దు చేసింది. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆగష్టు 14 వతేదీన ఏపీ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది.

అర్ధాంతరంగా తమ ఒప్పందాన్ని రద్దు చేయడం సరైంది కాదని నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. రివర్స్ టెండరింగ్ కు ప్రభుత్వం వెళ్లడాన్ని కూడ వ్యతిరేకిస్తున్నట్టుగా ఆ పిటిషన్ లో ఆ కంపెనీ ప్రస్తావించింది.

ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం నాడు మధ్యాహ్నం 2: 15 గంటలకు ఈ విషయమై విచారణను చేపట్టనుంది.

సంబంధిత వార్తలు

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios