ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,728 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,49,705కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,728 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,49,705కి చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిన్న ఒక్క రోజే కోవిడ్ కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,837కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 20,857 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 1,777 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,22,011కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 77,148 కరోనా టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 89,40,488కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 99, చిత్తూరు 206, తూర్పు గోదావరి 290, గుంటూరు 212, కడప 85, కృష్ణ 223, కర్నూలు 36, నెల్లూరు 91, ప్రకాశం 88, శ్రీకాకుళం 43, విశాఖపట్నం 74, విజయనగరం 42, పశ్చిమ గోదావరిలలో 239 కేసులు నమోదయ్యాయి.

అలాగే కోవిడ్ వల్ల చిత్తూరు 3, కృష్ణ 2, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరిలలో ఒక్కరు చొప్పున మరణించారు. 


Scroll to load tweet…