ప్రజా కూటమి: ఢిల్లీలో బాబుతో ఉత్తమ్ భేటీ

By narsimha lodeFirst Published Oct 28, 2018, 12:23 PM IST
Highlights

తెలంగాణలో  ప్రజా కూటమి( మహాకూటమి) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్నాయి. 


హైదరాబాద్:  తెలంగాణలో  ప్రజా కూటమి( మహాకూటమి) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కూడ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా కూటమి పేరుతో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లు పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు.న్యూఢిల్లీలో జాతీయ పార్టీ నేతలను కలిసేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఢిల్లీలోనే ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. 

సీట్ల సర్ధుబాటు విషయమై చంద్రబాబుతో  ఉత్తమ్‌ చర్చించారు. కాంగ్రెస్‌-89, టీడీపీ-15, టీజేఎస్‌-10, సీపీఐ-5 స్థానాల్లో పోటీ చేయాలనే అభిప్రాయానికి  వచ్చినట్టు సమాచారం. అయితే సీట్ల సర్దుబాటు‌ తుది దశలో ఉన్నట్టు ప్రజా కూటమి నేతలు చెబుతున్నారు. 

అయితే ఏఏ సీట్లను  మిత్రపక్షాలను వదిలేయాలనే విషయమై ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తొలుత చంద్రబాబుతో ఉత్తమ్  ఎయిర్‌పోర్ట్‌లో భేటీ కావాల్సి ఉండగా....  చివరకు వేదిక ఏపీ భవన్‌కు మారింది. మీడియాతో మాట్లాడకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఏపీ భవన్‌ నుండి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

సైనికులకు కాంగ్రెస్ వరాలు...ఐదెకరాలు, ఐదులక్షలు :ఉత్తమ్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

పొత్తులు: కాంగ్రెస్ అధిష్టానంపై నంది ఎల్లయ్య సంచలనం

ప్రైవేట్ రంగంలో కూడ లక్ష ఉద్యోగాలు: ఉత్తమ్ బంపర్ ఆఫర్

రాహుల్ చేసిన ఆ పనిని కేసీఆర్ చేయలేకపోయారు: ఉత్తమ్

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

click me!