బాబు ఇంటిపైనే చర్చ: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jun 26, 2019, 5:51 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

మా ఇళ్లు అక్రమ కట్టడం కాదు.. లోకేష్

ప్రజా వేదికలాగానే చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేశ్ ఓ ఆంగ్ల మీడియాతో స్పందించారు. తాము ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడం కాదంటూ లోకేశ్ ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు. 
 

కాపు నేతలు ఎందుకు రాలేదో తెలియదు: గంటా

కాపు నేతలు ఎందుకు చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదో  తనకు తెలియదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.
 

చంద్రబాబుకు జగన్ ఝలక్: కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్లో అవినీతిని వెలికి తీసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఏయే విభాగాల్లో  అక్రమాలు చోటు చేసుకొన్నాయో తవ్వేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని  నిర్ణయం తీసుకొన్నారు ఏపీ  సీఎం వైఎస్ జగన్ .
 

టీడీపీ నేత హత్య.. పోలీసులకు లొంగిపోయిన వైసీపీ నేత

టీడీపీ నేత ఉమా యాదవ్ హత్య కేసులో ప్రధాన నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. మంగళగిరిలో మంగళవారం ఉమా యాదవ్ అనే టీడీపీనేతను దారుణంగా దాడి చేసి మరీ హత్య చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. ఆ హత్య చేసింది మేమే అంటూ వైసీపీ నేత తోట శ్రీనివాసరావు యాదవ్ పాటు అతని అనుచరులు లొంగిపోయారు.
 

చంద్రబాబుకు షాక్: కాపు నేతలు డుమ్మా, బెజవాడ నేతలు బొండా ఉమా వంశీ సైతం...

చంద్రబాబు నాయుడు సమావేశానికి కీలక నేతలు గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విజయవాడలోనే ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబు సమావేశానికి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. 
 

కూల్చివేతలపై జగన్‌కు పవన్ కళ్యాణ్ బాసట

రాష్ట్రంలోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.బుధవారం నాడు ఆయన  ప్రజా వేదిక కూల్చివేతపై స్పందించారు. ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా దాన్ని కూల్చివేస్తేనే ప్రభుత్వంపై నమ్మకం కుదురుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
 

చంద్రబాబుకు ఊరట: ఉండవల్లి ఇంటిపై ఆళ్ల ప్రకటన

కోర్టు నిర్ణయం  తర్వాతే చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటి కూల్చివేతపై నిర్ణయం తీసుకొంటామని  మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
 

బిగ్ బాస్ ఎంట్రీపై యాంకర్ లాస్య కామెంట్స్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొంది. త్వరలోనే మూడో సీజన్ మొదలుకాబోతుంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ ప్రత్యక్షమైంది.

 

రేకుల షెడ్డు కోసం రూ.8 కోట్లా, ప్రజాధనాన్ని దోచేశారు: మంత్రి పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అక్రమాలకు ప్రజావేదికను అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు ఏపీ మంత్రి పేర్ని నాని. ప్రజావేదిక కోసం రూ.8కోట్లు ఖర్చుపెట్టామని తెలుగుదేశం పార్టీ చేప్తోందని తీరా చూస్తే రేకుల షెడ్డు మాత్రమే కనిపిస్తోందని చెప్పుకొచ్చారు
 

చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో ప్రజావేదిక చిచ్చు

ప్రజా వేదికపై టీడీపీ నేతు భిన్న స్వరాలు విన్పిస్తున్నారు. సీనియర్లు సైతం ప్రజా వేదిక భవనాన్ని కూల్చివేయడాన్ని తప్పుబడుతున్నారు. కానీ, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాత్రం ప్రజా వేదిక కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేయడాన్ని  సరైంది కాదని తేల్చి పారేశారు.
 

ఉండవల్లి ఇల్లు ఖాళీ: కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ

చంద్రబాబు అమరావతిలో మరో ఇంటి కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అనువైన నివాసం దొరికిన వెంటనే ప్రస్తుతం తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం తాను ఉంటున్న నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజా వేదికను ఇప్పటికే చాలా వరకు కూల్చి వేశారు.
 

ప్రజావేదిక వద్ద రోడ్డు వివాదం: రోడ్డు కూడా తొలగించాలంటూ రైతుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తి కావస్తోంది. ప్రజావేదిక అక్రమ కట్టడమని నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్మించారంటూ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. 

 

గుర్రంతో తారక్ తంటాలు.. వైరల్ అవుతున్న వీడియో!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా కనిపించనుంది. 

 

చంద్రబాబు ఇళ్లు ఖాళీచేయాలి.. నేను వదలను.. ఆళ్ల

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుని తాను వదలనని  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా... ప్రజావేదిక కూల్చివేత పనులను ఆళ్ల రామకృష్ణ పరిశీలించారు.
 

లోకేష్! డప్పుకొట్టుకోవడం ఆపు, ఆ క్రెడిట్ మీది కాదు : విజయసాయి ట్వీట్

పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు కోరారని తెలిపారు. దాని ఫలితంగానే రూ.55,548 కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. అంతేకాని  తన తండ్రి కష్టానికి ఫలితమని లోకేష్ డప్పుకొట్టు కోవడం వల్ల కాదన్నారు. 
 

ప్రజావేదిక నిర్మాణ వ్యయం రికవరీ : చంద్రబాబు, నారాయణలే టార్గెట్

మెుత్తానికి ప్రజావేదిక కూల్చివేత నిలుపువేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడమే కాదు ఏకంగా భవన నిర్మాణానికి అయిన ఖర్చు రికవరీ చేయాలంటూ పిటిషనర్ శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో రికవరీ వ్యయం ఆనాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ లేక నిర్మాణ దారుల నుంచి వసూలు చేస్తోందా అసలు కోర్టు ఏం చేప్తుందో తెలియాలంటే మరో రెండు వారాలపాటు వేచి చూడాల్సిందే. 

 

స్విమ్మింగ్ పూల్ లో పూజాహెగ్డే హాట్ షో!

బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాహెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలతో కలిసి పనిచేస్తోంది.

 

ప్రజావేదిక కూల్చివేత స్టేకు హైకోర్టు నిరాకరణ

ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత సరికాదని దాన్ని అడ్డుకోవాలంటూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన సామాజిక కార్యకర్త పోలూరి శ్రీనివాసరావు మంగళవారం రాత్రి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజావేదిక భవనం కూల్చివేతను నిలిపివేయాలంటూ పిటీషన్లో పేర్కొన్నారు. 

 

నటుడు రాజశేఖర్ కి అస్వస్థత!

సీనియర్ హీరో రాజశేఖర్ అస్వస్థతకి గురైనట్లు సమాచారం. దాని కారణంగా ఈరోజు ఆయన పాల్గొనాల్సిన కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం జరగాల్సిన 'కల్కి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా క్యాన్సిల్ చేయడానికి అదే కారణమని తెలుస్తోంది.
 

తప్పు చేయకపోయినా విమర్శలు ఎదుర్కొంటోంది.. సమంత కామెంట్స్!

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత తన స్నేహితురాలు, సింగర్ చిన్మయికి మరోసారి మద్దతుగా నిలిచింది. 'మీటూ' ఉద్యమం సమయంలో సమంతా.. చిన్మయి తరఫున మాట్లాడిన సంగతి తెలిసిందే. సాహిత్య రచయిత వైరముత్తు వేధింపుల గురించి చిన్మయి బయటపెట్టినప్పుడు ముందుగా స్పందించింది సమంతానే..


కేఏ పాల్ గా సునీల్, కేక పెట్టిస్తాడుగా..!

కేఏ పాల్ మొన్న ఎలక్షన్స్ సమయంలో  ఓ పెద్ద ఎంటర్‌టైనర్ . నాకంతా తెలుసు, ప్రపంచం మొత్తం నా కనుసన్నల్లో నడుస్తుందనే  చెప్తూంటారీ పాస్టర్.  తాను పాతికేళ్ల వాడిలా కనిపిస్తానని, ట్రంప్, బుష్ తో పరిచయాలని, ఇలా ఏదోదో మాట్లాడేస్తూంటారు. అయితే ఆ మాటలతోనే ఆయనకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. 
 

ధోనీ అభిమానులకు..హోటల్ బంపర్ ఆఫర్

సినీ తారలను, క్రికెటర్లకు అభిమానులు లక్షల సంఖ్యలో ఉంటారు. తమకు ఉన్న అభిమానాన్ని ఒక్కోరు ఒక్కోలా చూపిస్తూ ఉంటారు. కాగా... పశ్చిమ బెంగాల్ లోని ఓ హోటల్ లో అయితే... ధోనీ అభిమానంతో ఆయన ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు.
 

కివీస్ పై పాకిస్తాన్ గెలిచి తీరుతుంది: వసీం అక్రమ్ ధీమా

న్యూజిలాండ్ పై  తమ పాకి,స్తాన్ జట్టు గెలుస్తోందని ఆ జట్టు మాజీ ఆటగాడు వసీం అక్రమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ బుధవారం న్యూజిలాండ్ తో తలపడనుంది. టీమిండియాపై ఓటమి తర్వాత దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో బలమైన కివీస్ జట్టును పాకిస్తాన్ ఎదుర్కోబోతోంది.

click me!