అమరావతి: ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత సరికాదని దాన్ని అడ్డుకోవాలంటూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన సామాజిక కార్యకర్త పోలూరి శ్రీనివాసరావు మంగళవారం రాత్రి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజావేదిక భవనం కూల్చివేతను నిలిపివేయాలంటూ పిటీషన్లో పేర్కొన్నారు. 

హౌస్ మోషన్ ద్వారా ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం అర్థరాత్రి 2.30గంటల వరకు హైకోర్టు జడ్జిట ఎదుట విచారణ కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ శ్యాంప్రసాద్ లు ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టారు. 

ఇరువాదనలు విన్న హైకోర్టు ప్రజావేదిక కూల్చివేత నిలుపుదలకు నిరాకరించింది. ఏజీవాదనతో ఏకీభవించిన రాస్ట్ర అత్యున్నత ధర్మాసనం కేసును మూడు వారాలపాటు వాయిదా వేసింది.  

ఇకపోతే ప్రజావేదిక భవనం అక్రమ నిర్మాణం అక్రమమా కాదా అని పిటిషనర్ శ్రీనివాసరావును హైకోర్టు ప్రశ్నించింది. దాంతో ఆ భవనం అక్రమమేనని స్పష్టం చేయడంతో అలాంటప్పుడు అందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముందని హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు కళ్లెదుటే ప్రజావేదిక కూల్చివేత: మరికాసేపట్లో నేలమట్టం