అమరావతి: మాజీమంత్రి నారా లోకేష్ పై సెటైర్లు వేశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. పోలవరం క్రెడిట్ తన తండ్రిదంటూ లోకేష్ డప్పుకొట్టుకోవడం ఆపాలంటూ హెచ్చరించారు. 

పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు కోరారని తెలిపారు. దాని ఫలితంగానే రూ.55,548 కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. 

అంతేకాని  తన తండ్రి కష్టానికి ఫలితమని లోకేష్ డప్పుకొట్టు కోవడం వల్ల కాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది అంటూ తిట్టిపోశారు.

ఇకపోతే పోలవరం ప్రాజెక్టుపై సోమవారం మాజీమంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు తన తండ్రి కష్టార్జితమని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల ఆమోదం తన తండ్రి చంద్రబాబు నాయుడు కష్టమేనని కానీ దాన్ని వైసీపీ తన గొప్పతనంగా చెప్పుకుంటుంది అంటూ సెటైర్లు వేశారు.