దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా కనిపించనుంది. 

చారిత్రక కథాంశంతో భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ఇటీవల చరణ్, ఎన్టీఆర్ లకు గాయాలు కావడంతో చిత్రీకరణ వాయిదా వేశారు. మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ మొదలుకానుంది.

చారిత్రాత్మక సినిమా కావడంతో ఇందులో గుర్రపు స్వారీలు, భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. దానికోసం ఎన్టీఆర్ ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకోవాల్సి వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుర్రాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ఎన్టీఆర్ నానాతంటాలు పడుతున్నాడు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి!