అమరావతి: రాష్ట్రంలోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

బుధవారం నాడు ఆయన  ప్రజా వేదిక కూల్చివేతపై స్పందించారు. ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా దాన్ని కూల్చివేస్తేనే ప్రభుత్వంపై నమ్మకం కుదురుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

నిబంధనలకు విరుద్దంగా  నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా  మంగళవారం రాత్రి నుండి కూల్చివేస్తున్నారు. ప్రజా వేదిక పక్కనే చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఈ ఇల్లు కూడ అక్రమంగా నిర్మించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 

పర్మిషన్ లేకుండా ఇళ్లు నిర్మించిన వారిపై చర్యలు తీసుకొంటే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు సరైనవేనన్నారు. పర్మిషన్  లేకుండా నిర్మించిన వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు.