సీనియర్ హీరో రాజశేఖర్ అస్వస్థతకి గురైనట్లు సమాచారం. దాని కారణంగా ఈరోజు ఆయన పాల్గొనాల్సిన కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం జరగాల్సిన 'కల్కి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా క్యాన్సిల్ చేయడానికి అదే కారణమని తెలుస్తోంది.

ఒత్తిడి పెరగడంతో నిన్నటి నుండి జ్వరంతో బాధ పడుతున్నారు రాజశేఖర్. ఈరోజు కాస్త కోలుకున్నట్లు సమాచారం. జ్వరం తగ్గితే సాయంత్రం నుండి 'కల్కి' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు.

లేదంటే వాటిని కూడా క్యాన్సిల్ చేస్తారు. 'గరుడ వేగ' సినిమా సక్సెస్ తరువాత రాజశేఖర్ నటిస్తోన్న సినిమా కావడంతో 'కల్కి'పై అంచనాలు పెరిగాయి. సినిమా పోస్టర్లు, ట్రైలర్ లు ఆసక్తికరంగా ఉండడంతో ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.