దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత తన స్నేహితురాలు, సింగర్ చిన్మయికి మరోసారి మద్దతుగా నిలిచింది. 'మీటూ' ఉద్యమం సమయంలో సమంతా.. చిన్మయి తరఫున మాట్లాడిన సంగతి తెలిసిందే. సాహిత్య రచయిత వైరముత్తు వేధింపుల గురించి చిన్మయి బయటపెట్టినప్పుడు ముందుగా స్పందించింది సమంతానే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ కి చిన్మయికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఓపికగా సమాధానాలు చెప్పుకొచ్చింది సమంత. చిన్మయికి సపోర్ట్ చేస్తున్నందుకు గర్వపడుతుంటానని చెప్పింది. 'మీటూ' ఉద్యమం విదేశాల్లో ప్రారంభమైందని అక్కడ మహిళలు ఒకరికొకరు అందంగా ఉన్నారని సమంత చెప్పుకొచ్చింది.

నిజాలు బయట పెట్టాలంటే ఎంతో ధైర్యం కావాలని.. చిన్మయి ఇప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోందని.. ఎటువంటి తప్పు చేయని ఓ వ్యక్తి ఇలాంటి సమస్యలు ఎదుర్కోకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

'మీటూ' స్టోరీ చెప్పినప్పటి నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని.. ఇప్పటికీ తమిళనాడు డబ్బింగ్ యూనియన్ కు వ్యతిరేకంగా పోరాడుతోందని చెప్పుకొచ్చింది. ఈ విధంగా చిన్మయికి తన మద్దతు తెలుపుతూ మరోసారి తన ప్రేమను చాటుకుంది.