టీడీపీ నేత ఉమా యాదవ్ హత్య కేసులో ప్రధాన నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. మంగళగిరిలో మంగళవారం ఉమా యాదవ్ అనే టీడీపీనేతను దారుణంగా దాడి చేసి మరీ హత్య చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. ఆ హత్య చేసింది మేమే అంటూ వైసీపీ నేత తోట శ్రీనివాసరావు యాదవ్ పాటు అతని అనుచరులు లొంగిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గళగిరి ద్వారకానగర్‌కు చెందిన తాడిబోయిన ఉమాయాదవ్‌ (40) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. అతనికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. స్థానికంగా గౌతమబుద్ధ రోడ్డు సమీపంలో ఇటీవల తన కార్యాలయ నిర్మాణం చేపట్టాడు. ఆ పనులను ముగించుకుని మంగళవారం రాత్రి 8:20 గంటల సమయంలో ద్వారకానగర్‌లోని తన ఇంటికి బయల్దేరాడు. 

ఆ సమయంలో అతని వాహనాన్ని ప్రత్యర్థులు అడ్డగించారు. ఉమా యాదవ్, అతని సన్నిహితుడు శ్రీకాంత్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఉమా యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మంగళగిరిలో తీవ్ర కలకలం రేపింది. అయితే... ఇప్పుడు ఆ హత్య చేసింది తామేనంటూ వైసీపీ నేతలు ముందుకు రావడం మరింత కలకలం రేపుతోంది.