గ్యాంగ్ లీడర్ రివ్యూ: మరిన్ని వార్తలు

By Siva KodatiFirst Published Sep 13, 2019, 1:53 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

ఒక్కటి నిరూపించండి, ఉరేసుకుంటా: చంద్రబాబుకు తోట త్రిమూర్తులు సవాల్

చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో తాను 17 సంవత్సరాలు ఉన్నానని, ఒక్క వ్యక్తిగత పని చేయించున్నట్టు చంద్రబాబు చూపించగలరా అంటూ సవాల్ విసిరారు. తాను వ్యక్తిగత పనులు చేయించుకున్నట్లు నిరూపిస్తే కార్యకర్తల సమక్షంలోనే ఉరేసుకుంటానని స్పష్టం చేశారు. 

“గ్యాంగ్ లీడర్” మూవీ రివ్యూ

మెగాస్టార్ సూపర్ హిట్ టైటిల్ ని సైతం సొంతం చేసుకుని ఆద్యంతం నవ్విస్తామంటూ హామీ ఇస్తూ మన ముందుకు వచ్చారు. వీళ్ల హామీలను నెరవేర్చారా,ఫన్ తో సినిమాని నింపేసారా, అసలు కథేంటి..కొరియా సినిమా నుంచి కాన్సెప్ట్ లేపారనే టాక్ నిజమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 

బాబుకు షాక్: తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్‌బై

మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శుక్రవారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్‌సీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారంనాడు తోట త్రిమూర్తులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యకర్తల సమావేశంలో తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

అజ్ఞాతం వీడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

 మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  శుక్రవారం నాడు  నెల్లూరు జిల్లా వెంకటాచంల పోలీస్‌స్టేషన్ కు చేరుకొన్నారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీ‌స్ట్ స్టేషన్‌కు  చేరుకొన్న విషయం తెలుసుకొన్న  ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచండి, కేసీఆర్‌తో చర్చిస్తా: జగన్

పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి రివర్స్ టెండర్లను పిలవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా చేపట్టాలన్న యోచనలో ఉన్న వాటితో పాటు 25 శాతంలోపు నిర్మాణాలు పూర్తైన ప్రాజెక్టులను కూడ రివర్స్ టెండరింగ్ పరిధిలోకి తీసుకురావాలని జగన్ సూచించారు.పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలని సీఎం అధికారులను కోరారు.

 

కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో లేదు: మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

కొత్త జిల్లాల పెంపు ఆలోచన ఇప్పట్లో లేదని ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.

 

ఏ తప్పు చేయలేదు, కుట్ర చేస్తున్నారు : నన్నపనేని

తనపై కక్ష సాధించేందుకు ఉద్యోగులను లాగొద్దని మాజీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ఆర్‌సీపీ నేతలను కోరారు. తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

 

 

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

సత్తెనపల్లి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో రెండో నిందితుడు అజయ్ ను సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు  తనయుడు శివరామ్ మొదటి నిందితుడు.

 

సత్యనాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఎఎస్ కన్నుమూత

మాజీ ఐఎఎస్ అధికారి బీఎస్ యుగంధర్ శుక్రవారం నాడు కన్నుమూశారు. మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తండ్రే యుగంధర్. యుగంధర్ గతంలో ప్రధాని  లాల్ బహదూర్ శాస్త్రి కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు.

 

'యాక్షన్' టీజర్: బికినిలో తమన్నా మెరుపులు.. విశాల్ స్టంట్స్ అదుర్స్!

విశాల్ తాజాగా నటిస్తున్న తాజా చిత్రం యాక్షన్. సీనియర్ నటి ఖుష్బూ భర్త సుందర్ ఈ చిత్రానికి దర్శకుడు. తమన్నా, విశాల్ మరోసారి ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో జరిగింది.

టిడిపి బతికి బట్టకట్టాలంటే.. జూ.ఎన్టీఆర్ పై సీనియర్ నటుడి సంచలన వ్యాఖ్యలు!

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పరాజయం తర్వాత జూ. ఎన్టీఆర్ కేంద్రంగా ఆసక్తికర చర్చ మొదలైంది. ఎప్పటికైనా జూ.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందే అంటూ అభిమానుల్లో డిమాండ్ పెరుగుతోంది. తరచుగా కొందరు టిడిపి నేతలు, ప్రముఖులు ఎన్టీఆర్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. 

సేవ్ నల్లమల.. మహేష్ బాబు ఎందుకంత సైలెన్స్?

టాలీవుడ్ లో స్టార్ హీరోలు సామజిక అంశాలపై స్పందించడం అనేది చాలా కామన్. ఓ విధంగా మంచి విషయాలు కోట్లాది మందికి తెలియాలంటే వారు స్పందించడం కనీసం బాధ్యత అని చెప్పవచ్చు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ప్రస్తుతం తెలంగాణ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున రగడ మొదలవుతున్న సంగతి తెలిసిందే. 

పోలీస్ శాఖకు స్టార్ రెజ్లర్ పోగట్ దూరం... రాజకీయాలకు దగ్గరయ్యేందుకే

ఇటీవలే బిజెపి పార్టీలో చేరిన రెజ్లింగ్ స్టార్ బబితా పోగట్ తన పోలీస్ ఉద్యోగానికి రాాజీనామా చేశారు. డిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.   

కేంద్రం స్పాన్సర్ చేస్తే అమ్మఒడి దేశానికే ఆదర్శం: సీఎం జగన్

అమ్మ ఒడి పథకానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పాన్సర్ చేస్తే ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని దాని కోసం ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేర్చినట్లు తెలిపారు. 

జగన్ విజన్ ,ఆలోచన సూపర్: ప్రశంసించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్

రాష్ట్రంలో నిరక్షరాస్యతను అధిగమించడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని వైయస్ జగన్ వివరించారు. జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నవరత్నాల పథకానికి తమ వంతు కృషి అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌, ప్రణాళికలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. మూడు నెలల్లోనే అద్భుత పనితీరు చూపారని కితాబిచ్చారు. 

జగన్ సంచలన నిర్ణయం: హోదా ఉద్యమ కేసులు ఎత్తివేత, జీవో విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో నమోదైన కేసులను రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో నమోదైన కేసులన్నింటిని ఎత్తివేస్తామని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

మైసూరు మహారాజుగారి హారమని చెప్పి .. చేతిలో ఇత్తడి : రూ.5 లక్షల మోసం

రాజులు, రాజ్యాలు, పురాతన వస్తువులంటే మనలో చాలామందికి మోజు. అయితే కొందరి బలహీనతను కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అచ్చం ఇదే తరహాలో రాజుగారి హారమని చెప్పి.. రూ.5 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడో మాయగాడు

 

సీఎం జగన్‌ను కలిసి పీవీ సింధు, మరికొద్దిసేపట్లో సన్మానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కలిశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించిన నేపథ్యంలో సింధు.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

 

మంత్రులను అడ్డుకున్న కొండగట్టు బాధితులు, పరిహారంపై నిలదీత

జగిత్యాల జిల్లాలో తెలంగాణ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొడింగ్యాల మండలంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొనేందుకు మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్ వెళుతుండగా..  రామసాగరం గ్రామంలో మంత్రుల కాన్వాయ్‌ని కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలు, స్థానిక రైతులు అడ్డుకున్నారు

 

హెల్మెట్‌ మీదకు దూసుకొచ్చిన బంతి, క్రీజులోనే కుప్పకూలిన రసెల్

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో విండీస్ విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని హిట్ చేసే ప్రయత్నంలో అది రసెల్ చెవికి గాయం కావడంతో క్రీజులోనే కుప్పకూలిపోయాడు. 

 

దొంగ దొరికాడోచ్: ఒకటి కాదు.. రెండు కాదు 130 బైకులు చోరీ

విశాఖ పట్నం జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడి పోలీసులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరయ్య చౌదరి గ్యాంగ్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 

 

రిలయన్స్ జోరు: సరికొత్త దారంతో మెరుగైన దుస్తులు

ఇప్పటికే ఆయిల్, సహజ వాయువు, కమ్యూనికేషన్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్ను టెక్స్‌టైల్స్ మార్కెట్‌పై పడింది. ప్రస్తుత ‘‘సస్టైనబుల్ ఫ్యాషన్’’కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

click me!