Asianet News TeluguAsianet News Telugu

ఏ తప్పు చేయలేదు, కుట్ర చేస్తున్నారు : నన్నపనేని

దళిత ఎస్ఐ అనురాధ పట్ల తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని మాజీ మహిళ కమిషన్ చైర్మెన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు.

nannapaneni rajakumari slams on alla ramakrishna reddy
Author
Guntur, First Published Sep 13, 2019, 3:57 PM IST

గుంటూరు: తనపై కక్ష సాధించేందుకు ఉద్యోగులను లాగొద్దని మాజీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ఆర్‌సీపీ నేతలను కోరారు. తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు ఛలో ఆత్మకూరు కార్యక్రమం సమయంలో దళిత మహిళా ఎస్ఐ అనురాధపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయమై ఆమె స్పందించారు.

భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.... తాను ఏ తప్పు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. బైబిల్, ఖురాన్, భగవద్దీత దేనిపైనా ప్రమాణం చేయడానికైనా తాను సిద్దంగా ఉన్నానని ఆమె చెప్పారు.

ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మహిళ కమిషన్  చైర్ పర్సన్ గా ఉన్న తాను ఏనాడూ ఇతరులను ఇబ్బందిపెట్టలేదని ఆమె గుర్తు చేశారు. తనకు ఉన్న మంచిపేరును చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

తాను అనని మాటలను అన్నట్టుగా లేదిది ఉన్నట్టుగా తన మీద అభియోగం  మోపుతున్నారని ఆమె చెప్పారు. తనపై కక్షసాధింపు కోసం మహిళ ఎస్ఐను వాడుకొన్నారని ఆమె ఆరోపించారు.తాను తప్పుగా మాట్లాడినట్టుగా అనురాధ బహిరంగంగా వ్యాఖ్యలు చేయలేదని నన్నపపేని గుర్తు చేశారు.. తనను కించపర్చేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల నాని చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆమె కోరారు.. తనపై నన్నపనేని రాజకుమారి అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఎస్ఐ అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఆమెపై కేసు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

నన్నపనేని వ్యాఖ్యల దుమారం: పోటాపోటీగా డీజీపీని కలిసిన వైసీపీ, టీడీపీ నేతలు

నన్నపనేని వ్యాఖ్యల ఎఫెక్ట్: అరెస్ట్ కోరుతూ వైఎస్ఆర్‌సీపీ ర్యాలీ

చంద్రబాబు పిలుపు: నన్నపనేనిపై అట్రాసిటీ కేసు

నన్నపనేనిపై మహిళా ఎస్సై ఆగ్రహం: దళితుల వల్లే దరిద్రం అంటారా అంటూ ఫైర్

పోలీసుల అదుపులో నన్నపనేని రాజకుమారి

Follow Us:
Download App:
  • android
  • ios