గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పరాజయం తర్వాత జూ. ఎన్టీఆర్ కేంద్రంగా ఆసక్తికర చర్చ మొదలైంది. ఎప్పటికైనా జూ.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందే అంటూ అభిమానుల్లో డిమాండ్ పెరుగుతోంది. తరచుగా కొందరు టిడిపి నేతలు, ప్రముఖులు ఎన్టీఆర్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. 

టిడిపికి పూర్వ వైభవం రావాలంటే ఎన్టీఆర్ ని పార్టీలోకి ఆహ్వానించాలని అంటున్నారు. తాజగా సీనియర్ నటుడు గిరిబాబు జూ. ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిందని గిరిబాబు అన్నారు. మరో ఐదేళ్ల తర్వాత కూడా జగన్ ప్రభుత్వమే వస్తుంది. 

జూ. ఎన్టీఆర్ వస్తే టిడిపి బాగుపడుతుందని ఇప్పుడు అంతా అంటున్నారు. ఎన్టీఆర్ గురించి ఈ మాట నేను గతంలోనే చెప్పా. టిడిపి బతికి బట్టకట్టాలంటే జూ. ఎన్టీఆర్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టాలి. ఎన్టీఆర్ ని ప్రస్తుతం పార్టీలోకి రానిస్తారా అని ప్రశ్నించగా.. ఎన్టీఆర్ ని రానివ్వకుంటే ప్రస్తుతం ఉన్నవారిని ప్రజలు బయటకు పంపుతారు అని గిరిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2009 ఎన్నికల్లో భాగంగా ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగి టీడీపీ కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ లో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.