విశాల్ తాజాగా నటిస్తున్న తాజా చిత్రం యాక్షన్. సీనియర్ నటి ఖుష్బూ భర్త సుందర్ ఈ చిత్రానికి దర్శకుడు. తమన్నా, విశాల్ మరోసారి ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో జరిగింది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలు షూరూ అయ్యాయి. 

తాజాగా చిత్ర యూనిట్ యాక్షన్ చిత్ర టీజర్ ని రిలీజ్ చేసింది. దాదాపు నిమిషం నిడివి ఉన్న టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. హీరో విశాల్ కళ్ళు చెదిరే యాక్షన్ స్టంట్స్ తో అదరగొట్టేశాడు. ఇక మిల్కి బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అందాలు ఒలకబోయనుంది. 

ఈ చిత్రంలో మోడల్ ఆకాంక్ష పూరి కీలక పాత్రలో నటిస్తోంది. టీజర్ లో బికినిలో అలా మెరుపులా వచ్చి వెళ్లిపోయే భామ ఆకాంక్ష పూరి అని అంటున్నారు. ఈ చిత్ర టీజర్ లో మరో హైలైట్ ఏంటంటే హిప్ హాప్ తమిజా అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం.