హైదరాబాద్: మాజీ ఐఎఎస్ అధికారి బీఎస్ యుగంధర్ శుక్రవారం నాడు కన్నుమూశారు. మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తండ్రే యుగంధర్. యుగంధర్ గతంలో ప్రధాని  లాల్ బహదూర్ శాస్త్రి కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు.

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమయంలో కూడ ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో  పలు సంస్కరణలకు యుగంధర్ నాంది పలికారు. ఎక్కడ పనిచేసినా కూడ అక్కడ యుగంధర్  తన ముద్ర వేశారు.

నిజాయితీపరుడిగా, సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తారని  యుగంధర్ కు పేరుంది. ప్రణాళిక సంఘంలో ఆయన తనదైన ముద్రవేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ఐఎఎస్ అకాడమీ డైరెక్టర్ గా కూడ ఆయన కొంతకాలం పాటు పనిచేశారు.

పేదల పక్షపాతిగా యుగంధర్ కు పేరుంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నకాలంలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా యుగంధర్ పనిచేశారు. 1962  బ్యాచ్ ఐఎఎస్ అధికారి యుగంధర్.