అజ్ఞాతం వీడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు ప్రత్యక్షమయ్యారు.
నెల్లూరు: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు నెల్లూరు జిల్లా వెంకటాచంల పోలీస్‌స్టేషన్ కు చేరుకొన్నారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీస్ట్ స్టేషన్‌కు చేరుకొన్న విషయం తెలుసుకొన్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు.
వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని ఏలూరు రంగారెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అజ్ఞాతంలో వెళ్లాడని ప్రచారం సాగింది.
ఈ తరుణంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఉదయం వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నాడు.ఈ కేసు విషయంలో ఇప్పటికే రెండు దఫాలు వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
కానీ, ఇంతవరకు ఆయన హాజరుకాలేదు. న్యాయవాదులను పోలీసు స్టేషన్ కు పంపించారు. కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడ పోలీసులు సూచించారు. దీంతో ఆయన శుక్రవారం నాడు పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యారు.
సంబంధిత వార్తలు
కేసుల్లో టీడీపీ నేతలు: అజ్ఞాతంలో మరో మాజీమంత్రి
సరస్వతి భూముల కోసమే నాపై కేసులు: అజ్ఞాతం వీడిన యరపతినేని
సోమిరెడ్డికి షాక్.. భూ వివాదంలో నోటీసులు
కేసులు పెడతారని ఊహించా: సోమిరెడ్డి
ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు