“గ్యాంగ్ లీడర్” మూవీ రివ్యూ

First Published 13, Sep 2019, 1:12 PM

నాని సినిమా అంటే ఓ కొత్త తరహా కథ, దానికి కామెడీ ట్రీట్మెంట్, ఓ మోస్టరు ఎమోషన్ కలగలిపిన ప్యాకేజి. డైరక్టర్ విక్రమ్ కే కుమార్ ది ఓ డిఫరెంట్ స్కూల్. కొత్త నేపధ్యం, వెరైటీ ట్విస్ట్ లు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగలిగిన లగేజి.

(Review By --సూర్య ప్రకాష్ జోశ్యుల) నాని సినిమా అంటే ఓ కొత్త తరహా కథ, దానికి కామెడీ ట్రీట్మెంట్, ఓ మోస్టరు ఎమోషన్ కలగలిపిన ప్యాకేజి. డైరక్టర్ విక్రమ్ కే కుమార్ ది ఓ డిఫరెంట్ స్కూల్. కొత్త నేపధ్యం, వెరైటీ ట్విస్ట్ లు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగలిగిన లగేజి. వీరిద్దరూ కలిస్తే ఖచ్చితంగా అంతకు మించి అన్న ప్రొడక్ట్ ఎక్సెపెక్ట్ చేస్తాం. దానికి తోడు మెగాస్టార్ సూపర్ హిట్ టైటిల్ ని సైతం సొంతం చేసుకుని ఆద్యంతం నవ్విస్తామంటూ హామీ ఇస్తూ మన ముందుకు వచ్చారు. వీళ్ల హామీలను నెరవేర్చారా,ఫన్ తో సినిమాని నింపేసారా, అసలు కథేంటి..కొరియా సినిమా నుంచి కాన్సెప్ట్ లేపారనే టాక్ నిజమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి : ఐదుగురు మెంబర్స్ టీమ్ గా కలిసి ఓ బ్యాంక్ ను దొంగతనం చేస్తారు. అయితే ఆ దొంగతనం సక్సెస్ ఫుల్ గా పూర్తికాగానే ఒకడు వాళ్లని లేపేసి ఆ దోచిన మొత్తం 300 కోట్లు లేపేసి పారిపోతాడు. పోలీస్ లు కూడా ఆ దొంగ ఎవరనేది ట్రేస్ చేయలేకపోతారు. ఓ 14 నెలల తర్వాత వేర్వేరు వయస్సులలో ఉన్న ఐదుగురు ఆడవాళ్లు కలుస్తారు. వాళ్ళంతా ఆ దొంగతనం లో చనిపోయిన వాళ్లకు చెందిన వాళ్లు. వాళ్లంతా ఓ టీమ్ గా ఏర్పడి ఆ డబ్బు కొట్టేసి పారిపోయిన ద్రోహిపై పగ తీర్చుకోవాలనుకుని, ఆ డబ్బు సొంతం చేసుకోవాలనుకుంటారు. అయితే తమకు ఓ తెలివైన బుర్ర తోడు ఉంటే బెస్ట్ అని ది బెస్ట్ క్రైమ్ రైటర్ రివేంజ్ నవలా స్పెషలిస్ట్ ...పెన్సిల్ పార్ధసారధి (నాని)ని కలుస్తారు. నువ్వే మా గ్యాంగ్ కు లీడర్ గా ఉండాలని అడుగుతారు.  పెన్సిల్ పార్దసారధి (నాని) ఓ పెద్ద నవలా రచయిత అవ్వాలని జీవితాశయం. ఎవరు సలహా ఇచ్చారో ఏమో కానీ హాలీవుడ్ క్రైమ్ సినిమాలను తెలుగులో నవలలుగా రాస్తూంటాడు. (అఫ్ కోర్స్ తెలుగులో నవల రచయితలకు మార్కెట్ పడిపోయిందనే విషయం గమనించినట్లు లేడు. లేకపోతే ఆ హాలీవుడ్ సినిమాలనే తెలుగు సినిమా కథలుగా మార్చి అమ్ముకుందుడేమో). అయితే అతని నవలలు ఏవీ క్లిక్ కాకపోవటంతో ..తన స్నేహితుడు (ప్రియదర్శి) సలహాపై వాళ్లకు సాయిం చేయటానికి ఒప్పుకుంటాడు. వాళ్లతో చేసే రియల్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ జర్నీని ఆ తర్వాత నవలగా రాసి ఫేమస్ అవ్వపోవచ్చని స్కెచ్ వేస్తాడు. అలా నాని ఆ కేసుని ఇన్విస్టిగేట్ చేస్తూ మెల్లిగా ఆ గ్యాంగ్ మెంబర్స్ లో ఒకరైన ప్రియ (ప్రియాంక మోహన్) తో ప్రేమలో పడతాడు. ఆమె చనిపోయిన వాళ్లలో ఒకతనికి ఫియాన్సి. ఆమెతో నిన్ను చూసిన అందంలో అంటూ పాట కూడా పాడుకుంటాడు. ఇలా ఈ రైటర్ గారు అటు లవ్ ని ఇటు క్రైమ్ ఇన్విస్టిగేషన్ ని బాలెన్స్ చేస్తూంటాడు. అప్పుడు సీన్ లోకి దేవ్ (కార్తికేయ)వస్తాడు. అతను ఆలిండియా లో నెంబర్ వన్ రేసర్. డబ్బు కోసం ఎంతదైనా తెగించే మనస్తత్వం.. తన తండ్రిని కూడా డబ్బు కోసం లేపేసే క్రూరత్వం ఉంటాయి. అతనే ఈ బ్యాంక్ దొంగతనం కేసులో అసలైన ద్రోహి అని కనిపెట్టి ..వీళ్లంతా కలిసి నాని నేతృత్వంలో పగ తీర్చుకోవాలనుకుంటారు. అప్పుడు ఏమైంది.. ఈ క్ర‌మంలో ఎలాంటి ట్విస్ట్‌లు వ‌చ్చాయి..? మొదట బ్యాంక్ దొంగతనం చేసిన ఆ ఐదుగురు ఎవరు...నాని చివరకు సక్సెస్ ఫుల్ రైటర్ గా అవ్వగలిగారా, అతని లవ్ స్టోరి ఓ కొలిక్కి వచ్చిందా వంటి విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమాను చూడాల్సిందే.

కథ,కథనం ఎలా ఉన్నాయంటే.. : మొదటగా నాని లాంటి హీరో దొరికాడు కదా అని ....ఏదో రెగ్యులర్ కమర్షియల్ కామెడీ సినిమా చేయాలనుకోకుండా కొత్త తరహా కథ చెప్పాలన్న ఆలోచన వచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ని అభినందించాలి. ఇదొక మిక్సెడ్ జానర్ ఫిలిం. ఫన్, క్రైమ్, సెంటిమెంట్, యాక్షన్ అన్ని కలగాపులగంగా వస్తూంటాయి. సినిమా ప్రారంభం బ్యాంక్ దొంగతనం బ్లాక్ చాలా స్టైలిష్ గా ఇంట్రస్టింగ్ తీయటంతో మనం హుక్ అయ్యిపోతాం. అయితే అప్పుడు పెరిగిన ఎక్సెపెక్టేషన్స్ తర్వాత వచ్చే సీన్స్ రీచ్ కాలేదు. చాలా ప్లాట్ గా ఉందనిపిస్తుంది.

ట్రైలర్ లో చెప్పిన కథతోనే దాదాపు ఫస్టాఫ్ మొత్తం నడుస్తుంది. దాంతో పెద్దగా కథేమీ జరిగినట్లు అనిపించదు. తెలిసిన విషయం మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే నాని కామెడీ ...పగలబడి నవ్వేలా ఉండదు. దానికి తోడు స్లో నేరేషన్ తో కదులుతూంటుంది. అంటే కాంప్లిక్ట్ లేని కథా సెటప్ ఇంట్రస్ట్ కలిగించలేదన్నమాట. అయితే ఎప్పుడైతే కార్తికేయ పాత్ర ఎంటరైందో అప్పుడు కథలో వేడి పుడుతుంది. ఆ పాత్ర తో జర్నీ పెద్దగా లేకుండా ఇంటర్వెల్ వస్తుంది. సెటప్ అంతసేపు కాకుండా కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కథ లో ట్విస్ట్ లు వచ్చినట్లు అనిపించినా అవీ పెద్దగా కిక్ ఇవ్వవు. ఎందుకంటే అవన్నీ ప్రెడిక్టుబుల్ గానే ఉంటాయి. అయితే జెన్యూన్ గా నవ్వులు అక్కడే ఉన్నాయి. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ హై ఇవ్వలేకపోయాయి. చివరి ఇరవై నిముషాలు జస్ట్ ఓకే..ఈ కథ ఇక ఇలాగే ముగిస్తారు అన్నట్లుగా సీన్స్ నడుస్తూంటాయి.

ఎమోషనల్ డెప్త్ మిస్ : ఎంత కామెడీ సినిమా అయినా ఎక్కడో చోట గుండెలను స్పృశించకపోతే ఏవో నాలుగు జోక్స్ చూసి బయిటకు వచ్చినట్లు అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. కాసేపు నవ్వుకున్నా...సినిమా పట్టి ఉంచి నిలబెట్టే ఎమోషనల్ బ్లాక్స్ మిస్సయ్యాయి. రైటర్ పార్దసారధితో మనం ఎందుకు జర్నీ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే అతనేమీ కష్టంలో పడలేదు. కష్టాల్లో ఉన్నవాళ్లను సాయిం చేయాలి అనుకోలేదు. రివేంజ్ తీర్చుకునే వాళ్లకు సాయిం చేయాలనుకుంటాడు. దాంతో ఆ పాత్రను మనం లైట్ తీసుకుంటాం కానీ ఓన్ చేసుకోము.

తీసిపారేసే సినిమా కాదు : అలాగని ఈ సినిమా మరీ ఒక్కసారి కూడా చూడటం వేస్ట్ అనుకునే వ్యవహారం కాదు. సరదాగా ఓ వీకెండ్ కాలక్షేపానికి లోటు ఉండదు. డీసెంట్ గా ఉండే సినిమా...అదీ నానీ హీరో కాబట్టి ఫ్యామిలీలకు కూడా కదలచ్చు.

హైలెట్స్ : ఈ సినిమాకు కొత్త తరహా స్టోరీ లైన్, నాని, కార్తికేయ కలిసి నటించటం, చిన్న చిన్న ట్విస్ట్ లు, సెకండాఫ్ లో వచ్చే ఫన్. అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమా మొత్తాన్ని భుజంపై మోసిన నాని సామర్ధ్యం. ప్రొడక్షన్ వ్యాల్యూస్.

కొరియా సినిమా తో పోలిక :ఈ సినిమాకు 2008లో వచ్చిన యాక్షన్ కామెడీ Girl Scouts కు థీమ్ లో మాత్రమే పోలిక ఉంది. Girl Scoutsలో నలుగు ఆడవాళ్లు సూపర్ బజార్ పెడదామని దాచుకున్న డబ్బుని క్రెడిట్ యూనియన్ సీఈవో లేపేస్తే , మోసపోయిన వాళ్లంతా ఓ గ్యాంగ్ గా ఏర్పడి ట్రాక్ చేసి పట్టుకుని ఆ డబ్బుని ఎలా వెనక్కి రికవరీ చేసుకున్నారనే పాయింట్ చుట్టూ ఫన్ గా తిరుగుతుంది. గ్యాంగ్ లీడర్ లో ఆ పాయింట్ అంతర్గతంగా కనపడుతుంది కానీ ఆ ట్రీట్మెంట్ వేరు..ఈ సినిమా వేరు. ప్రేరణ పొందారేమో కానీ కాపీ అయితే కాదు.

ఫైనల్ థాట్: అల్లరి నరేష్ సినిమాని నాని చేసినట్లుంది.

Rating: 2.5 / 5

Rating: 2.5 / 5

loader