తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:56 PM (IST) May 23
ప్లేఆఫ్ ఆశలు లేవు… అయినా ముగింపు ఘనంగా ఉండాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశిస్తున్నట్లుంది. అందుకే శక్తివంచన లేకుండా ఆడుతూ ఐపిఎల్ చివర్లో అద్భుతాలు చేస్తోంది. తాజాగా ఆర్సిబిపై అద్భుత విజయాన్ని అందుకుంది.
11:19 PM (IST) May 23
టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత విరాట్ కొహ్లీలో కొత్తగా కనిపించిన ఆనందం గురించి దినేష్ కార్తీక్ వెల్లడించారు. కుటుంబంతో సమయం గడుపుతూ, ఆటను ఆస్వాదిస్తూ, ఆర్సిబికి ఐపిఎల్ లో విజయాన్ని తెచ్చిపెట్టడంపై దృష్టి సారించాడన్నారు.
10:46 PM (IST) May 23
తెలంగాణ రాజకీయాలో కేసీఆర్ కూతురు కవిత హాట్ టాపిక్ గా మారారు. ఆమె అన్నపై తిరుగుబాటు చేసే మరో షర్మిల అవుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా కవిత తాను తండ్రికి రాసిన లేఖ బయటకురావడంపై చేసిన కామెంట్స్ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.
09:46 PM (IST) May 23
దేశ రాజధాని న్యూడిల్లీలో కూర్చుని ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఇకపై శాశ్వతంగా అమరావతే రాజధానిగా ఉండేలా ఆయన పావులు కదుపుతున్నారు.
07:29 PM (IST) May 23
కొన్నేళ్లుగా మానవాళిని వణికించిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
06:52 PM (IST) May 23
ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొత్త యుద్ధ నౌక ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదంపై తీవ్రంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నేరంగా పరిగణించారు.
06:13 PM (IST) May 23
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల వేళ భారతీయులకు పాకిస్థాన్‌పై సహజంగానే కోపం పెరుగుతోంది. భారత్ ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్థాన్ మాత్రం సాధారణ పౌరులపై విరుచుకుపడింది. అయితే భారత ఆర్మీ దీనికి తగిన సమాధానం చెప్పింది.
05:44 PM (IST) May 23
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షల తేదీలను వాయిదా వేయాలని కొంత మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.
05:11 PM (IST) May 23
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును కూడగట్టేందుకు భారతదేశం ఏడు పార్లమెంటరీ బృందాలను 32 కీలక దేశాలకు పంపింది.
04:47 PM (IST) May 23
ఆర్టిఫిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ తనను తాను మార్చుకుంటూ ప్రపంచాన్ని మార్చేస్తోంది. అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తోంది. మరి బిజినెస్ ఐడియా గురించి అడిగితే ఏం చెబుతుంది.?
03:57 PM (IST) May 23
ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.
03:33 PM (IST) May 23
హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన చేశారు.
02:55 PM (IST) May 23
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటంబంలో విషాదాన్ని నింపింది. కారు, లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు.
02:35 PM (IST) May 23
ఒకప్పుడు డబ్బులు కావాలంటే బ్యాంకు వెళ్లి విత్‌డ్రా ఫామ్ తీసుకొని పెద్ద లైన్‌లో నిలబడే వాళ్లం కానీ ప్రస్తుతం కాలం మారింది. చేతిలో ఏటీఎమ్ కార్డు ఉంటే చాలు క్షణాల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే మారిన కాలంతో పాటు ఏటీఎమ్ సేవలు కూడా మారాయి.
02:27 PM (IST) May 23
గుజరాత్ టైటాన్స్ ఓటమి అనంతరం. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ మధ్య హ్యాండ్‌షేక్ వ్యవహారం నెట్టింట చర్చకు దారి తీసింది.
02:06 PM (IST) May 23
ఈ వారాంతంలో భూమిని ఒక భారీ గ్రహశకలం సమీపించి వెళ్తుంది. ఐఫిల్ టవర్‌కు సమానంగా ఉన్న ఈ గ్రహశకలం మే 24న అంటే రేపు శనివారం సాయంత్రం 4:07 గంటలకు భూమిని దాటుతుంది. ఈ గ్రహశకలాన్ని అమెరికా పరిశోధన సంస్థ నాసా “క్లోజ్ ఎన్‌కౌంటర్”గా పేర్కొంది.
01:57 PM (IST) May 23
ఏఐ టూల్స్ వినియోగం పెరిగిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ 6 వేల మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే.
01:53 PM (IST) May 23
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు వద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ విషయంపై స్పందించిన ధర్మాసనం బెయిల్‌ను నిరాకకరించింది. ఇందుకు గల కారణాలను వివరించింది.
01:17 PM (IST) May 23
వాట్సప్ కొత్తగా వాయిస్ చాట్ ఫీచర్‌ను అన్ని గ్రూపులకు విస్తరించింది. గ్రూప్ సభ్యుల సంఖ్యపై ఆ పరిమితి తొలగించింది.
12:12 PM (IST) May 23
ప్రపంచ తాబేలు దినోత్సవం 2025: ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున తాబేళ్లను మరియు తాబేళ్ల యొక్క వివిధ జాతులను కాపాడటానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచారం చేస్తారు.
12:05 PM (IST) May 23
హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ప్రభుత్వం 72 గంటల గడువు విధించింది. 6 షరతులు పూర్తి చేస్తేనే విదేశీ విద్యార్థుల ప్రవేశం పునఃప్రారంభం అవుతుంది.
11:53 AM (IST) May 23
నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఒక చిత్రాన్ని ముందుగా అందరూ ఫ్లాప్ అని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మూవీ ఏంటి, ఎంత పెద్ద విజయం సాధించిందో ఇప్పుడు చూద్దాం.
11:47 AM (IST) May 23
2025 తొలి త్రైమాసికంలో కెనడా భారత విద్యార్థులకు స్టడీ పర్మిట్లు 31 శాతం తగ్గించింది.
11:02 AM (IST) May 23
ఈ వేసవిలో ఎండలు తగ్గి వర్షాలు పెరగడానికి పశ్చిమ అవాంతరాలు, ముందుగా వచ్చే రుతుపవనాలే కారణం.
10:18 AM (IST) May 23
తెలంగాణలో పోలీస్ అధికారుల సంఖ్య మరింత పెరగనుంది. రాష్ట్రానికి కేటాయించే ఐపిఎస్ ల సంఖ్యను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత పెంచారో తెలుసా?
10:16 AM (IST) May 23
బాలీవుడ్ సెలబ్రెటీలకు కోవిడ్ తాకిడి మొదలయింది. శిల్పా శిరోద్కర్ తర్వాత మరో హీరోయిన్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
10:14 AM (IST) May 23
విశాఖలో 28 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు, అధికారులు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
09:13 AM (IST) May 23
త్వరలోనే వేసవి సెలవులు ముగియనున్నాయి. ఇది విద్యార్థులకు కాస్త బాధ కలిగించవచ్చు. కానీ వచ్చే అకడమిక్ ఇయర్ లో వచ్చే హాలిడేస్ గురించి తెలిస్తే ఇదే విద్యార్థులు ఎగిరిగంతేస్తారు. ఈ హాలిడేస్ గురించి తెలుసుకుందాం.
08:59 AM (IST) May 23
గాజాలో ఆకలి సంక్షోభంపై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ఆహారాన్ని ఆయుధంగా మార్చొద్దని సూచించింది.
07:45 AM (IST) May 23
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరీముఖ్యంగా ఓ నాలుగు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ జిల్లాలేవి
07:33 AM (IST) May 23
థగ్ లైఫ్ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అన్నారు కమల్ హాసన్. గతంలో తమ కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు సినిమా కంటే కూడా ఈ సినిమా ఇంకా ఎక్కువ సక్సెస్ సాధిస్తుందన్నారు. ఇంతకీ కమల్ హాసన్ ఏమంటున్నారంటే?
07:10 AM (IST) May 23
బిట్‌కాయిన్ విలువ 1,11,878 డాలర్లకు చేరింది. ట్రంప్ నిర్ణయాలు, మదుపర్ల ఆసక్తితో క్రిప్టో మార్కెట్‌లో ఉత్సాహం రెట్టింపైంది.