Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Business Ideas: 30 రోజుల్లో ల‌క్ష రూపాయలు ఎలా సంపాదించాలి? చాట్ జీపీటీ ఇచ్చిన బెస్ట్ ఐడియాస్ ఇవే

Business Ideas: 30 రోజుల్లో ల‌క్ష రూపాయలు ఎలా సంపాదించాలి? చాట్ జీపీటీ ఇచ్చిన బెస్ట్ ఐడియాస్ ఇవే

ఆర్టిఫిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ త‌న‌ను తాను మార్చుకుంటూ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. అడిగిన ప్ర‌తీ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేస్తోంది. మ‌రి బిజినెస్ ఐడియా గురించి అడిగితే ఏం చెబుతుంది.?  

Narender Vaitla | Updated : May 23 2025, 04:50 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
చాట్ జీపీటీ ఐడియాలు
Image Credit : Gemini

చాట్ జీపీటీ ఐడియాలు

ప్ర‌స్తుతం బిజినెస్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే లాభం వ‌స్తుందో లేదో అన్న భ‌యంతో చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ స‌రైన ప్ర‌ణాళిక ఉంటే డ‌బ్బు సుల‌భంగా సంపాదించ‌వ‌చ్చని ఆర్థిక రంగ నిపుణులు సైతం చెబుతుంటారు. 30 రోజుల్లో ల‌క్ష రూపాయాలు ఎలా సంపాదించాల‌న్న ప్ర‌శ్న‌కు ప్ర‌ముఖ ఏఐ ప్లాట్ ఫామ్ చాట్ జీపీటీ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

26
అఫిలియేట్ మార్కెటింగ్
Image Credit : X

అఫిలియేట్ మార్కెటింగ్

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామ‌ర్స్ సంస్థ‌ల్లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. దీంట్లో మీరు పెట్టుబ‌డి పెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. వాట్సాప్‌, టెటిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌, యూట్యూబ్ షార్ట్ ద్వారా వ‌స్తువుల‌ను ప్ర‌మోట్ చేస్తే స‌రిపోతుంది. దీంతో మీకు ప్ర‌తీ అమ్మ‌కంపై కొంత క‌మిష‌న్ వ‌స్తుంది.

కాన్వా, ఇన్‌షాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూబ్యూట్‌, టెలిగ్రామ్ వంటి వాటిని ఉప‌యోగిస్తూ వీడియోల‌ను రూపొందిస్తూ ప్ర‌మోట్ చేయొచ్చు. ఇల్లు క‌ద‌ల‌కుండానే ల‌క్ష‌ల్లో సంపాదించ‌వ‌చ్చు.

Related Articles

BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్: రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గించిన బీఎస్ఎన్ఎల్
BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్: రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గించిన బీఎస్ఎన్ఎల్
Saving scheme: రోజుకు రూ. 50 పొదుపు చేస్తే రూ. 35 ల‌క్ష‌లు పొందొచ్చు.. ఎలాగంటే
Saving scheme: రోజుకు రూ. 50 పొదుపు చేస్తే రూ. 35 ల‌క్ష‌లు పొందొచ్చు.. ఎలాగంటే
36
క్యాటరింగ్ / హోమ్ ఫుడ్ టిఫిన్ సర్వీస్
Image Credit : Getty

క్యాటరింగ్ / హోమ్ ఫుడ్ టిఫిన్ సర్వీస్

క్యాట‌రింగ్, ఫుడ్ టిఫిన్ సేవ‌లు కూడా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ లాభాలు పొందొచ్చు. క‌నీసం రూ. 10 వేల లోపు పెట్టుబ‌డితో టిఫిన్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయొచ్చు. ఐటీ ఉద్యోగులు, కార్మికులు ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో టిఫిన్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌డం ద్వారా మంచి లాభాలు ఆర్జించ‌వ‌చ్చు.

క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ కూడా ఇటీవ‌ల బాగా వర్క‌వుట్ అవుతుంది. ఇంట్లోనే వంట‌లు చేసి. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్స్‌లో లిస్టింగ్ చేసుకోవ‌చ్చు.

46
ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ రీల్స్ సర్వీస్ (వీడియో ఎడిటింగ్‌, ప్ర‌మోష‌న్స్‌)
Image Credit : Pixabay

ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ రీల్స్ సర్వీస్ (వీడియో ఎడిటింగ్‌, ప్ర‌మోష‌న్స్‌)

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఇన్ఫ్లూయ‌ర్స్ సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారి వీడియోల‌ను ఎడిటింట్ చేయ‌డం ద్వారా డ‌బ్బులు పొందొచ్చు. ఇలాంటి సేవ‌ల‌ను పొందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాన్వా, కాప్‌క‌ట్‌, వీఎన్ వంటి యాప్స్‌ను ఉప‌యోగించే వీడియోల‌ను ఎడిటింగ్ చేయొచ్చు. ఒక్కో వీడియోకు రూ. 500 నుంచి రూ. 1500 వ‌ర‌కు పొందొచ్చు.

56
ఫ్రీలాన్స‌ర్స్
Image Credit : Getty

ఫ్రీలాన్స‌ర్స్

ఇటీవ‌ల ఫ్రీలాన్స‌ర్స్‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం రూపాయి పెట్టుబ‌డి పెట్టాల్సిన ప‌నిలేదు. కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్ వంటి సేవ‌లు అందిస్తూ డ‌బ్బులు ఆర్జించ‌వ‌చ్చు. లింక్డిన్ వంటి జాబ్ పోర్టల్స్‌లో ఇలాంటి అవ‌కాశాలు ల‌భిస్తాయి.

66
ప్రింట్-ఆన్-డిమాండ్ గిఫ్ట్ బిజినెస్
Image Credit : Gemini

ప్రింట్-ఆన్-డిమాండ్ గిఫ్ట్ బిజినెస్

చిన్న పెట్టుబ‌డితో వ్యాపారం చేయాల‌నుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ వ్యాపారం విస్త‌రిస్తోంది. మగ్స్, కీచైన్‌లు, టీ ష‌ర్ట్‌ల‌పై కస్టమైజ్డ్ ప్రింటింగ్ చేసి విక్ర‌యించ‌వ‌చ్చు. పుట్టిన రోజు, వివాహాల‌కు బ‌హుమ‌తుల‌ను ఇచ్చేందుకు వీలుగా ఇలాంటి వాటిని త‌యారు చేయొచ్చు.

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 
Recommended Stories
Top Stories