Apr 17, 2025, 11:52 PM IST
Telugu news live updates: MI vs SRH : ముంబైని జాకీపెట్టి లేపిన విల్ జాక్స్... అయితేనే ఎస్‌ఆర్‌హెచ్ పై ఎంఐ గెలుపు


చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. చైనా ఎగుమతులపై అమెరికా ఏకంగా 245 శాతం సుంకాలను విధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతోంది. రేవంత్ ఈరోజు తోషిబా కంపెనీని సందర్శించనున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో యూరప్ పర్యటనకు వెళ్లారు. ఐదురోజుల పాటు చంద్రబాబు విదేశీ పర్యటన ఉండనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..
11:52 PM
MI vs SRH : ముంబైని జాకీపెట్టి లేపిన విల్ జాక్స్... అయితేనే ఎస్‌ఆర్‌హెచ్ పై ఎంఐ గెలుపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదికయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడ్డ ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్ లో మరింత పైకి ఎగబాకింది ఎంఐ. ఇలా ముంబైని జాకీపెట్టి లేపాడు విల్ జాక్స్.
పూర్తి కథనం చదవండి11:25 PM
Andhra Pradesh: డీఎస్సీ అభ్యర్థులకు పండగలాంటి న్యూస్.. ప్రభుత్వం వయోపరిమితి పెంచిందోచ్!
Andhra Pradesh: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ సీఎం సంతకం పూర్తి చేయడగా.. అతి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ఇక నోటిఫికేషన్ ఇచ్చిన ఇచ్చిన 45 రోజుల్లోనే తుది పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇక తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు పండగలాంటి వార్తను ప్రభుత్వం ప్రకటించింది. అభ్యర్థుల వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పూర్తి కథనం చదవండి10:51 PM
Viral Video : బాబా బౌలింగ్ లో ధావన్ సూపర్ సిక్సర్... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
టీం ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్, ధీరేంద్ర శాస్త్రితో క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబా బౌలింగ్ లో శిఖర్ బ్యాటింగ్ ఎలా సాగిందో తెలుసా?
పూర్తి కథనం చదవండి10:25 PM
వక్ఫ్ చట్ట సవరణకు ఈ ముస్లింల ఆమోదం... ప్రధానిని కలిసి కృతజ్ఞతలు (Video)
వక్ఫ్ సవరణ చట్టం 2025 పై ఓవైపు కొందరు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేేస్తుంటే... మరికొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా దావూదీ బోహ్రా సమాజం ప్రధాని మోడీని కలిసి, తమ చిరకాల కోరిక తీరిందని సంతోషం వ్యక్తం చేసింది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్'పై నమ్మకం ఉంచారంటూ ప్రధానిని ప్రశంసించారు. .
పూర్తి కథనం చదవండి9:55 PM
MI vs SRH : మొదట్లో శర్మ, చివర్లో వర్మ ... ముంబైకి హైదరబాదీ శావర్మ రుచిచూపించారుగా
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ లు ముంబై ఇండియన్స్ పై అదరగొట్టారు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ వల్లే హైదరాబాద్ టీం గౌరవప్రదమైన 162 పరుగులు చేయగలిగింది. ఇలా శావర్మ స్పెషల్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి9:03 PM
ఆక్రమిత కాశ్మీర్ ను ఖాళీ చేయాల్సిందే..: పాకిస్తాన్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
కశ్మీర్ తమ జీవనాడి అని పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కశ్మీర్‌తో పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక సంబంధం అక్రమ ఆక్రమణ అని, ఆ భూభాగాన్ని వారు ఖాళీ చేయాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
పూర్తి కథనం చదవండి7:06 PM
వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీంకోర్టు విచారణ : 10 కీలక అంశాలు, ఆదేశాలు
వక్ఫ్ (సవరణ) చట్టం 2025పై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి... కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు, ముస్లింలు ఈ చట్టంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి
6:09 PM
Hyderabad: 600 ఎకరాల్లో రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు.. జపాన్‌లో రేవంత్ భారీ స్కెచ్
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తొలి రోజే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే మారుబెనీ కార్పొరేషన్‌తో కీలక చర్చలు జరిపారు.
5:51 PM
Viral News : కలికాలం... 20 ఏళ్ల కాబోయే అల్లుడిని లేపుకుపోయిన 40 ఏళ్ల మహిళ
ఈ రోజుల్లో మానవ బంధాలకు విలువే లేకుండా పోయింది. వావివరసలు మరిచి కొందరు నీఛంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఓ 40 ఏళ్ల ముదురు మహిళ తన కూతురికి కాబోయే భర్తను లేపుకుపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. అంతటితో ఆగకుండా ఈ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కాబోయే అల్లుడిని ఎందుకు లేపుకుపోయిందో ఆ మహిళ వివరించారు.
పూర్తి కథనం చదవండి5:45 PM
YS Jagan cases-ED: జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. త్వరలో జైలుకేనా.. కేసులన్నీ బయటికీ లాగుతున్నారు!
Jagan DA case: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులో విచారణ ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఈ ఏప్రిల్‌లోనే కేంద్ర దర్యాప్తు సంస్థలైన (సీబీఐ), ఈడీపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈక్రమంలో జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. దీంతో వైసీపీలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇక నుంచి ఒక్కొక్క కేసును బయటకు తీసి జగన్‌ను దోషిగా నిరూపించి అతన్ని రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక తాజగా జరుగుతున్న పరిణామాలపై విశ్లేషణ కథనం.
5:15 PM
UPI: ఫోన్‌పేలో యూపీఐ సర్కిల్ ఫీచర్.. ఏంటిది? ఎలా ఉపయోగపడుతుంది.?
దేశంలో రోజురోజుకీ యూపీఐ సేవలు విస్తరిస్తున్నాయి. ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ కూడా తక్కువ ధరకే లభిస్తుండడంతో యూపీఐ సేవల విస్తృతి పెరిగింది. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా యూపీఐ పేమెంట్స్ యాప్‌లో రకరకాల ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల యూపీఐ సర్కిల్ పేరుతో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటీ ఫీచర్.? దీనిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
5:09 PM
ఫహాద్ ఫాజిల్ భార్యకు విడాకులు ఇస్తున్నారా? నజ్రియా నజీమ్ ఎమోషన్ పోస్ట్ ఏంటంటే?
నాలుగు నెలలకు పైగా సోషల్ మీడియాలోనూ కనిపించలేదు నటి నజ్రియా నజీమ్. తాను మానసికంగా ఇబ్బందిపడుతున్నట్టు పెట్టిన పోస్ట్ కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఫాహద్ తో ఏమైనా గొడవలు వచ్చాయా అని చర్చించుకుంటున్నారు అభిమనాలు. అసలు సంగతేంటి.
పూర్తి కథనం చదవండి4:49 PM
heroine Emotional: డిప్రెషన్‌లో ప్రముఖ నటి.. జీవితం నరకంగా ఉంది.. క్షమించమని రిక్వెస్ట్!
మళయాలంతోపాటు, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ నటి తాను డిప్రెషన్‌లో ఉన్నానని, గత కొంత కాలంగా తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. అందుకే గత కొంత కాలంగా అందరికీ దూరంగా బతుకుతున్నానని, నా అనుకున్న వారినీ దూరం పెట్టానని... క్షమించాలని వేడుకుంది. తాజాగా డిప్రెషన్‌లోకి వెళ్లడానికి కారణాలు, తదితర వివరాలను తెలియజేసింది.
4:18 PM
కేవలం ఓ కుక్క కోసమే ఈడీ సోదాలు... రూ.50 కోట్ల శునకం దొరికిందా? దీని అసలు స్టోరీ ఇదే
కేవలం ఓ కుక్క కోసం దేశంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్ధ ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. రూ.50 కోట్ల విలువైన 'వోల్ఫ్ డాగ్' అసలు కథను బైటపెట్టింది ఈడి. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి4:09 PM
Recharge plan: రూ. 26తో రీఛార్జ్ చేస్తే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్ ఏంటంటే
టెలికం రంగంలో పెరిగిన పోటీ నేపథ్యంలో రకరకాల ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి కంపెనీలు. ముఖ్యంగా ఇటీవల కంపెనీలు టారిఫ్‌లను పెంచిన తరుణంలో యూజర్లు చేజారిపోకుండా చూసుకుంటున్నాయి. ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తోంది రిలయన్స్ జియో. యూజర్ల అవసరాలకు అనుగుణంగా భిన్నమైన ప్లాన్స్‌ను తీసుకొస్తున్న జియో. తాజాగా మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
3:35 PM
అనారోగ్యం, వ్యక్తిగత జీవితంలో సమస్యలపై తొలిసారి స్పందించిన ఏఆర్ రెహమాన్
సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ఇటీవల తన ఆరోగ్య సమస్య గురించి, తరచుగా వార్తల్లో నిలుస్తున్న దాని గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
పూర్తి కథనం చదవండి3:06 PM
5 కోట్లు డిమాండ్ చేసిన ఇళయరాజా, మైత్రి నిర్మాత రవిశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో ఇళయరాజా స్వరపరిచిన 3 పాటలు ఉండగా, అనుమతి లేకుండా తన పాటను వాడుకున్నారని ఇళయరాజా తరపున నోటీసు పంపడంతో, దానికి నిర్మాత ఘాటుగా సమాధానం ఇచ్చారు.
2:50 PM
Astrology: ఈ 4 రాశుల వారు బంగారు ఉంగరం ధరిస్తే.. జీవితం జిగేల్ మనడం ఖాయం.
భారతీయులను, బంగారాన్ని విడదీసి చూడలేం. అందుకే బంగారం ధర ఎంత పెరిగినా, దానికి డిమాండ్ తగ్గదు. బంగారం కేవలం అలంకరణ వస్తువుగానే కాకుండా భవిష్యత్తుకు భరోసానిచ్చే పెట్టుబడి మార్గంగా కూడా చాలా మంది నమ్ముతుంటారు. ఇక ఒంటిపై కాస్తయినా బంగారం ఉండాలని చెబుతుంటారు. అయితే జ్యోతిష్యం కూడా ఇదే చెబుతుంది.
1:31 PM
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 700 కి.మీ ప్రయాణం.. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUV అదిరిపోయింది !
Hyundai nexo hydrogen: మార్కెట్ లోకి అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అదిరిపోయే ఫీచర్లతో హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్ లోకి వచ్చింది. హ్యుందాయ్ తన కొత్త హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వాహనం 'నెక్సో'ను విడుదలతో ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవం తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
12:59 PM
Ola: రూ. 6 వేలు డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటీ మీ సొంతం.. నెలకు కేవలం రూ. 2800
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు భారీగా పెరగడం, ప్రభుత్వాలు సైతం ఈవీ వాహనాలకు సబ్సిడీలు అందిస్తుండడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా స్కూటీలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఈక్రమంలోనే టూ వీలర్ ఎలక్ట్రిక్ మార్కెట్‌లో అగ్రగామిగా రాణిస్తున్న ఓలా కస్టమర్ల కోసం అదిరిపోయే డీల్‌ను తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
12:01 PM
Investment: కూతురు వివాహం నాటికి రూ. 55 లక్షలు కావాలంటే.. నెలకు ఎంత పొదుపు చేయాలి?
ప్రస్తుతం చాలా మందిలో ఆర్థిక క్రమ శిక్షణ పెరుగుతోంది. వృధా ఖర్చులను తగ్గిస్తూ పొదుపు చేస్తున్నారు. పెరుగుతోన్న ధరలు, ఆర్థిక మాంద్య భయాలు కారణం ఏదైనా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఎందులో పెట్టుబడి పెట్టాలనే విషయంలో మాత్రం ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మరి కూతురు వివాహం నాటికి చేతికి భారీ మొత్తంలో డబ్బులు వచ్చేలా ప్లాన్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
11:48 AM
Mitchell Starc: 12 బంతులు, 12 యార్కర్లు! రాజస్థాన్ కు మిచెల్ స్టార్క్ దెబ్బ.. అక్షర్ పటేల్ కామెంట్స్ వైరల్
Mitchell Starc's destruction of Rajasthan: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. చివరి బంతిలో కూడా ఫలితం రాలేదు. మ్యాచ్ టై కావడంతో ఐపీఎల్ 2025లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. మిచెల్ స్టార్క్ దెబ్బతో రాజస్థాన్ పై ఢిల్లీ గెలిచింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ సునామీ సీక్రేట్ ను డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ రివీల్ చేశాడు.
11:08 AM
చిక్కుల్లో దసరా విలన్ షైన్ టామ్ చాకో.. డ్రగ్స్ తీసుకుని నటితో అసభ్యకర ప్రవర్తన, సంచలన ఆరోపణలు
నటి విన్సీ అలోషియస్, నటుడు షైన్ టామ్ చాకోపై ఫిర్యాదు చేశారు. సినిమా సెట్‌లో డ్రగ్స్ వాడి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు.
పూర్తి కథనం చదవండి10:42 AM
భార్యాభర్తలు పొరపాటున కూడా ఈ మాటలు అనుకోవద్దు.. ఇవి బంధానికే ఎసరు తెస్తాయి
relationships: భార్యాభర్తలు అన్నాక గొడవలు, గిల్లికజ్జాలు సహజం. గొడవపడ్డా కొన్నాళ్లైతే మళ్లీ సర్దుకుంటారు. ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉంటారు. కానీ ఈ గొడవ సమయంలో వాడే కొన్ని పదాలు వారిని తీవ్రంగా హర్ట్ చేస్తుంటాయి. ఇద్దరి మధ్య పూడ్చుకోలేనంత అగాధం నెలకొల్పుతాయి. ఇంతకీ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి పదాలు వాడొద్దు అంటే..
పూర్తి కథనం చదవండి10:24 AM
IPL 2025 Super Over : తొలి సూపర్ సూపర్ ఓవర్... మిచెల్ స్టార్క్ పైసా వసూల్ హీరో
DC vs RR - IPL 2025 Super Over: ఐపీఎల్ 2025లో తొలి సూపర్ ఓవర్ థ్రిల్లర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ లో అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ గెలిచింది. ఈ మ్యాచ్ గెలుపులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిచెల్ స్టార్క్ గురించి. అద్భుతమైన బౌలింగ్ తో పైసా వసూల్ అనిపించేలా మ్యాచ్ స్వరూపాన్ని మార్చిపడేశాడు.
పూర్తి కథనం చదవండి10:19 AM
Hyderabad: ఇదిగో ఈ ఫొటో షేర్ చేసినందుకే.. IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 400 ఎకరాల భూముల్లో ఉన్న చెట్లను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నించగా వర్సిటీ విద్యార్థులు, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో ఈ అంశం కాస్త సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం సైతం తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
9:15 AM
తగ్గేదేలే అంటున్న బంగారం.. ఆల్ టైం గరిష్ఠంతో రేపో, మాపో.. రూ.లక్ష క్రాస్..!!
రూ.లక్షకి చేరువ: బంగారం పరుగు ఆగడం లేదు. బుధవారం నాడు ఆల్ టైం గరిష్ఠం ధర నమోదు చేసి, రూ.లక్ష మార్కుకు దగ్గరైంది. అమెరికా-చైనాల మధ్య ముదురుతున్న సుంకాల యుద్ధం, అంతర్జాతీయ షేర్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, డాలర్ ఇండెక్స్ పడిపోవడం.. కారణాలు ఏవైతేనేం జనం పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుండటంతో పసిడి ధర రోజురోజుకీ చుక్కలు తాకుతోంది.
పూర్తి కథనం చదవండి9:13 AM
నటి జనని నిశ్చితార్థం : జంట ఎంత చూడముచ్చటగా ఉన్నారో కదా !
జనని నిశ్చితార్థం: నటి జనని, సాయి రోషన్ శ్యామ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ శుభవార్తను ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పూర్తి కథనం చదవండి