MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Mitchell Starc: 12 బంతులు, 12 యార్కర్లు! రాజస్థాన్ కు మిచెల్ స్టార్క్ దెబ్బ.. సీక్రెట్ చెప్పిన అక్షర్ పటేల్

Mitchell Starc: 12 బంతులు, 12 యార్కర్లు! రాజస్థాన్ కు మిచెల్ స్టార్క్ దెబ్బ.. సీక్రెట్ చెప్పిన అక్షర్ పటేల్

Mitchell Starc's destruction of Rajasthan: ఐపీఎల్ 2025లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ‌ధ్య  థ్రిల్లింగ్ మ్యాచ్ జ‌రిగింది. చివ‌రి బంతిలో కూడా ఫలితం రాలేదు. మ్యాచ్ టై కావ‌డంతో ఐపీఎల్ 2025లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్ జ‌రిగింది. మిచెల్ స్టార్క్ దెబ్బ‌తో రాజ‌స్థాన్ పై ఢిల్లీ గెలిచింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ సునామీ సీక్రేట్ ను డీసీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ రివీల్ చేశాడు. 
 

Mahesh Rajamoni | Updated : Apr 17 2025, 11:50 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Mitchell Starc (Photo: @ipl/X)

Mitchell Starc (Photo: @ipl/X)

Axar Patel reveals Mitchell Starc's destruction of RR vs DC: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్ గెలుపులో మిచెల్ స్టార్క్ అసాధారణమైన చివరి ఓవర్ బౌలింగ్, ముఖ్యంగా అతని యార్కర్ ఎగ్జిక్యూషన్ కీలక పాత్ర పోషించింద‌ని డీసీ కెప్టెన్ క్షర్ పటేల్ ప్రశంస‌లు కురిపించాడు. 

పవర్ ప్లేలో స్టో స్టార్ట్ ఉన్నప్పటికీ, మిచెల్ స్టార్ సూప‌ర్ బౌలింగ్ తో తరువాత ఢిల్లీ ఇన్నింగ్స్ ఊపందుకుంది. సూపర్ ఓవర్ లో రాజ‌స్థాన్ బౌల‌ర్ సందీప్ శర్మ ఒత్తిడిని అధిగమించి కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ సూప‌ర్ షాట్స్ తో సూప‌ర్ ఓవ‌ర్ లో  ఆర్ఆర్ ను ఓడించి డీసీకి  విజయాన్ని అందించారు.

24
Mitchell Starc

Mitchell Starc

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 32వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్-రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ్డాయి.  బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో రాజ‌స్థాన్ పై ఢిల్లీ  క్యాపిట‌ల్స్ సూపర్ విక్ట‌రీ అందుకుంది. ఫీల్డింగ్ లో త‌ప్పిదాలు చేసినా.. బ్యాటింగ్, బౌలింగ్ లో స‌రైన స‌మ‌యంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అద‌ర‌గొట్టింది. దీంతో సంజూ శాంస‌న్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయ‌ల్స్ గెలుపు ముంగిట ఆగిపోయింది. 

 

34
Mitchell Starc

Mitchell Starc

సూపర్ ఓవర్ గెలుపులో మిచెల్ స్టార్క్ కీల‌క పాత్ర పోషించాడు. మొత్తంగా మ్యాచ్ ను మ‌లుపు తిప్పింది అత‌నే. ఈ మ్యాచ్ చివరి, సూప‌ర్ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ క్లినికల్ ఎగ్జిక్యూషన్ కీలక పాత్ర పోషించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ప్రశంసించాడు . చివరి ఓవర్‌లో రాయల్స్‌కు కేవలం 9 పరుగులు మాత్రమే అవసరం, కానీ స్టార్క్ అద్భుత‌మైన బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. కేవ‌లం  8 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మ్యాచ్ ను  టైగా మార్చి సూప‌ర్ ఓవ‌ర్ కు తీసుకెళ్లాడు. అక్క‌డ కూడా అద‌ర‌గొట్టాడు. 

రాజ‌స్థాన్ పై ఢిల్లీ గెలిచిన త‌ర్వాత కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ మాట్లాడుతూ.. "స్టార్క్ తన లక్ష్యాన్ని సాధిస్తే, మేము తిరిగి పోటీలోకి వస్తామని నాకు తెలుసు. అతను వరుసగా 12 బంతులు అద్భుతంగా వేశాడు.. ప్రతి బాల్ ను యార్కర్ వేయ‌డం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ ఏ స‌మ‌యంలోనైనా అద్భుతంగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. ఈ మ్యాచ్ లో ప‌రుగులు రాకుండా యార్క‌ర్లు వేయ‌డంలో స్ప‌ష్టంగా ఉన్నాడు. అతను ఒక్కసారి మాత్రమే ఆ మార్క్‌ను మిస్ అయ్యాడు" అని అక్షర్  ప‌టేల్ స్టార్క్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

44
Asianet Image

స్టార్ బౌలింగ్ దెబ్బ‌తో తొలుత మ్యాచ్ ను టై కాగా, ఆ త‌ర్వాత సూపర్ ఓవర్‌లో 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అద్భుతంగా ఛేదించింది. కేఎల్ రాహుల్, ట్రిస్టాన్ స్టబ్స్ కేవలం నాలుగు బంతుల్లోనే విజయాన్ని సాధించారు. అక్ష‌ర్ ప‌టేల్ ఇంకా మాట్లాడుతూ.. పవర్ ప్లే సమయంలో ఢిల్లీ అంచనాలను అందుకోలేకపోయిందని అన్నాడు. తాము అనుకున్న ప‌రుగులు రాలేద‌ని తెలిపాడు. 

"ఆరంభంలోనే ఎక్కువ స్కోర్ చేసి ఉండాల్సింది. పిచ్ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని కెఎల్ రాహుల్ అన్నారు.  అయితే, సానుకూలంగా ఉండి, తమ లక్ష్యాన్ని చూపించాలని నేను గుర్తు చేశాను. కొన్నిసార్లు, ఒత్తిడి మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తుంది. ఆర్‌ఆర్ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, నేను ఆ వేడిని అనుభవించాను. అందుకే బౌలర్లను సరైన లైన్, లెంగ్త్ బౌలింగ్ మాత్ర‌మే వేయాల‌ని కోరాను" అని చెప్పాడు.

మ్యాచ్ గెలుచుకున్నాము కానీ, తాము ఇంకా మెరుగైన బ్యాటింగ్ చేయాల్సింద‌ని అక్ష‌ర్ ప‌టేల్ అన్నాడు. ముఖ్యంగా ప‌వ‌ర్ ప్లే లో అనుకున్న విధంగా ప‌రుగులు చేయ‌డంలో స‌క్సెస్ కాలేద‌ని తెలిపాడు. కానీ, 12, 13 ఓవ‌ర్ లో జోరు పెంచ‌డం మ్యాచ్ లో కీల‌కంగా మారింద‌ని అన్నాడు. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 
Recommended Stories
Top Stories