Viral News : కలికాలం... 20 ఏళ్ల కాబోయే అల్లుడిని లేపుకుపోయిన 40 ఏళ్ల మహిళ
ఈ రోజుల్లో మానవ బంధాలకు విలువే లేకుండా పోయింది. వావివరసలు మరిచి కొందరు నీఛంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఓ 40 ఏళ్ల ముదురు మహిళ తన కూతురికి కాబోయే భర్తను లేపుకుపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. అంతటితో ఆగకుండా ఈ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కాబోయే అల్లుడిని ఎందుకు లేపుకుపోయిందో ఆ మహిళ వివరించారు.

woman eloped with daughter's fiance
woman eloped with daughter's fiance : ఈ కలికాలంలో అనేక చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మానవ సంబంధాలు పూర్తిగి విచ్చిన్నం అయిపోయాయి... అసలు బంధాలు, బంధుత్వాలకు విలువే లేకుండా పోయింది. కొందరు వావివరసలు మరిచి మానవ సంబంధాలకే మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారు. తాము సుఖంగా ఉంటే చాలు... ఎవరేమైపోతే తమకేంటి అనేలా వ్యవహరిస్తున్నారు. చివరకు ఓ తల్లి కూడా ఇలాగే స్వార్థంగా ఆలోచించింది... సొంత కూతురి జీవితాన్ని నాశనం చేస్తూ కాబోయే అల్లుడితో లేచిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.
woman eloped with daughter's fiance
కాబోయే అల్లుడితో అత్త జంప్ :
ఉత్తర ప్రదేశ్ అలీఘర్ సమీపంలోని దాదోన్ లో జితేంద్ర కుమార్, సప్న దంపతులు నివాసం ఉండేవారు. వీరికి శివానీ అనే పెళ్లీడు కూతురు ఉంది. కూతురికి పెళ్లి చేయాలని భావించిన ఈ దంపతులకు రాహుల్ కుమార్ అనే యువకుడు బాగా నచ్చాడు. కూతురికి కూడా అతడు నచ్చడంలో పెళ్లి నిశ్చయించారు. ఏప్రిల్ 16న పెళ్లికి మూహూర్తం కూడా పెట్టుకున్నారు.
అయితే కూతురికి కాబోయే భర్తపై సప్న మనసు పారేసుకుంది. 40 ఏళ్ల వయసులో ఆమె వావివరసలు మరిచి కాబోయే అల్లుడిని లొంగదీసుకుంది. మాయమాటలతో 20 ఏళ్ల యువకుడిని వలలో వేసుకున్న ఈ కిలాడీ లేడీ కూతురు జీవితంతో ఆడుకుంది.
మరో పదిరోజుల్లో కూతురు పెళ్లి అనగా అంటే ఈ నెల 6న కాబోయే అల్లుడితో పరారయ్యింది. పెళ్లి బట్టలు కొనేందుకు వెళుతున్నామని చెప్పి బయటకు వెళ్లిన వీరిద్దరూ తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రం రాహుల్ తన తండ్రికి ఫోన్ చేసి కాబోయే అత్తతో కలిసి వెళ్లినట్లు... ఇక తిరిగిరానని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అత్తా అల్లుడు లేచిపోయిన వ్యవహారం ఇటీవల ఉత్తరప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సప్న భర్త జితేంద్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన కూతురు పెళ్లికోసం దాచిన భారీ నగదు, బంగారు నగలతో భార్య పరారయినట్లు అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
woman eloped with daughter's fiance
లేచిపోయిన అత్తా అల్లుడు ట్విస్ట్ ఇచ్చారుగా...
పోలీస్ కేసు నేపథ్యంలో లేచిపోయిన అత్తాఅల్లుడు బయటకువచ్చారు. తాజాగా వారిద్దరు పోలీసులను ఆశ్రయించారు... తాము ఒకరినొకరం ఇష్టపడ్డామని చెబుతున్నారు. తాను నగలు, నగదు తీసుకెళ్లినట్లు భర్త చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని... గతంలో రాహుల్ కొనిచ్చిన ఫోన్ తో పాటు ఓ రూ.200 మాత్రమే తీసుకెళ్లినట్లు సప్న చెబుతోంది. రాహుల్ తో జీవితం పంచుకునేందుకు సిద్దమని... త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకుంటామని ఆమె చెబుతోంది.
తన భర్త జితేంద్ర పెద్ద తాగుబోతు... ఫుల్లుగా తాగొచ్చి నిత్యం తనను కొట్టేవాడని సప్న చెబుతోంది. అతడి చిత్రహింసలు భరించలేకే రాహుల్ కు దగ్గరైనట్లు చెబుతోంది. కూతురు శివానీ కూడా తనతో గొడవపడేదని... తల్లిపై ఏమాత్రం ప్రేమ చూపించేది కాదంటోంది. ఇలా కుటుంబసభ్యుల ప్రేమకు దూరమైన తనను రాహుల్ ప్రేమగా చూసుకున్నాడు... అందువల్లే అతడిని పెళ్లిచేసుకుని జీవితాంతం కలిసుండాలని భావించినట్లు చెబుతోంది. తన కూతురు మరో యువకుడిని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉండాలని... తాను మాత్రం రాహుల్ ను వదిలిపెట్టబోనని సప్న తెగేసి చెబుతోంది.
అయితే కాబోయే అత్తతో పరారైన రాహుల్ మాత్రం డైలమాలో ఉన్నాడు. అతడు సప్న ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆమె వెంట వెళ్లినట్లు చెబుతున్నాడు. అయితే ఇంత జరిగాక చేసేదేమీ లేక పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. మరి ఈ అత్తా అల్లుడి ప్రేమాయణం ఏమవుతుందో చూడాలి.