కేవలం ఓ కుక్క కోసమే ఈడీ సోదాలు... రూ.50 కోట్ల శునకం దొరికిందా? అసలు స్టోరీ ఇదే
కేవలం ఓ కుక్క కోసం దేశంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్ధ ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇలా రూ.50 కోట్ల విలువైన 'వోల్ఫ్ డాగ్' అసలు కథను బైటపెట్టింది ఈడి. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Wolf dog
Expensive Pet Dog : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు కుక్క భారతదేశంలో ఉందంటూ ఇటీవల తెగ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తోడేలు, కుక్క రెండింటి లక్షణాలు గల హైబ్రిడ్ జాతి వోల్ఫ్ డాగ్ తో ఫోటోలతో ఫోజుకొట్టాడు. ఈ అరుదైన పెంపుడు కుక్క ఖరీదు దాదాపు 4.4 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.50 కోట్లట. ఈ కుక్క ధర విని అందరూ ఆశ్చర్యపోయారు... దీని గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఈ కుక్క గురించి కథనాలు ప్రసారం చేసాయి.
అయితే తాజాగా ఈ ఖరీదైన కుక్క కథ ఫేక్ గా తేలింది. వోల్ప్ డాగ్ ను కలిగివున్నట్లు... దానికోసం రూ.50 కోట్లు ఖర్చుచేసానని సదరు బెంగళూరు వాసి చెప్పిందంతా కట్టుకథగా తేలింది. ప్రపంచంలోనే ఖరీదైన కుక్కను కలిగివున్నాడన్న ప్రచారం నేపథ్యంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సదరు వ్యక్తి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇందులో అసలు నిజం బైటపడింది... ఖరీదైన కుక్కల పేరిట అతడు ఫేక్ న్యూస్ ప్రచారం చేసాడని తేలింది.
wolf dog
వోల్ఫ్ డాగ్ అసలు స్టోరీ ఇదే...
విదేశాల నుంచి అరుదైన జాతి కుక్కను కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెప్పుకున్న బెంగళూరుకు చెందిన వ్యక్తి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట రోడ్డులో సతీష్ ఇంట్లో ఇవాళ (గురువారం) ఈడీ దాడులు చేపట్టింది. ఖరీదైన కుక్కలను కలిగి ఉన్నాడని తెగ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు... అయితే అతడు చెప్పిందంతా అబద్దమేనని ఈడి గుర్తించింది.
సతీష్ వద్ద కోట్ల రూపాయల విలువైన కుక్కలేవీ లేవని ఈడి తేల్చింది. అతడివద్ద దేశీయ జాతి కుక్కలే ఉన్నాయని... వాటిని విదేశాలకు చెందిన ఖరీదైన జాతులుగా పేర్కొంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఇలా ఇప్పటికే అతడు చాలామందిని మోసగించాడని ఈడీ దర్యాప్తులో తేలింది.
అరుదైన మరియు ఖరీదైన కుక్క జాతులను కలిగి ఉన్నాడని నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయజాతి కుక్కలను అద్దెకు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇలా ప్రజలను ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట మోసం చేస్తున్నాడని గుర్తించారు. ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీలాండరింగ్ కు పాల్పడి ఉండవచ్చని ఈడి అధికారులు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే ఖరీదైన కుక్కల పేరిట తప్పుడు ప్రచారం చేసిన సతీష్ ను అదుపులోకి తీసుకున్నాడు. అతడివద్ద ఉన్న కుక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు, సతీష్ చేతిలో మోసపోయిన వారిని గుర్తించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.