- Home
- Entertainment
- heroine Emotional: డిప్రెషన్‌లో ప్రముఖ నటి.. జీవితం నరకంగా ఉంది.. క్షమించమని రిక్వెస్ట్!
heroine Emotional: డిప్రెషన్‌లో ప్రముఖ నటి.. జీవితం నరకంగా ఉంది.. క్షమించమని రిక్వెస్ట్!
మళయాలంతోపాటు, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ నటి తాను డిప్రెషన్‌లో ఉన్నానని, గత కొంత కాలంగా తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. అందుకే గత కొంత కాలంగా అందరికీ దూరంగా బతుకుతున్నానని, నా అనుకున్న వారినీ దూరం పెట్టానని... క్షమించాలని వేడుకుంది. తాజాగా డిప్రెషన్‌లోకి వెళ్లడానికి కారణాలు, తదితర వివరాలను తెలియజేసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నజ్రియా నజీమ్ గురించి తెలియని వారు ఉండరు.. రాజారాణి సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోని యూత్‌లో మంచి పేరు తెచ్చుకుంది. హీరోని బ్రదర్, బ్రదర్ అంటూ ఆటపట్టించే సీన్‌ను చూసి.. అదేవిధంగా నేటి తరం అమ్మాయిలు ఇష్టపడే అబ్బాయిలను ఆటపట్టిస్తుంటారు. నటించిన ఒక్క సినిమాతోనే అందంతోపాటు, తన చలాకీతనంతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్ఠానం సంపాదించుకుంది. అయితే.. ఈ మధ్యకాలంలో ఆమె పెద్దగా యాక్టివ్‌గా లేరు.. ఎవరికీ అందుబాటులో లేరు.. దీంతో నజ్రియాకి ఏమైంది అని మాళయాల ప్రేక్షకులు, ఆమె స్నేహితులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారంట.
Sookshmadarshini movie review basil joseph Nazriya Nazim mc jithin
సన్నిహితుల నుంచి దర్శకులు, నిర్మాతలు ఆమెను కలిసే వీలు లేకుండా.. అసలు ఆమె ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదట. కనీసం ఫోన్ చేద్దామన్నా నజ్రియా అందుబాటులో లేరు.. నజ్రియాకు ఏమైంది, అనారోగ్య సమస్యలా లేదా ఇతర కారణాలో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో నజ్రియా తన ఇన్‌స్టాగ్రాంలో తన ఆరోగ్య పరిస్థితి బాలేదని పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
గత కొంతకాలంగా నజ్రియా సైలెంట్‌గా ఉంటోంది. ఆమె రీసెంట్ నటించిన సూక్షదర్శిని సినిమా హిట్ అయ్యింది. సినిమాకు సంబంధించిన వేడుకల్లో ఎక్కడా ఆమె కనిపించలేదు. కనీసం ఎవరికీ అందుబాటులో లేరు... దీనిపై ఆమె స్పందిస్తూ.. వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్ల తాను కొంత కాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు నజ్రియా చెబుతున్నారు. అందువల్లనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, దర్శకులు, నటీనటులు ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో లేనట్లు చెప్పుకొచ్చారు. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకుని క్షమించాలని కోరారు.
Sookshmadarshini review
ఎప్పుడూ సోషల్‌మీడియా, బయట యాక్టివ్‌గా కనిపించే తాను.. ఈ మధ్యకాలంలో ఎవరికీ అందుబాటులో లేనని స్నేహితులందరిని నజ్రియా క్షమాపణలు చెప్పారు. వారిలో కలిగించిన ఆందోళన, అసౌకర్యానికి బాధపడుతున్నానన్నారు. అదేవిధంగా సినిమాల కోసం తనను సంప్రదించడానికి ట్రైచేసిన కోస్టార్స్, దర్శకులు, నిర్మాతలకు అందుబాటులోకి రానుందుకు క్షమించాలని కోరారు. తాను త్వరలోనే కోలుకుని అందరి ముందుకు వస్తానని అన్నారు. జీవితంలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పుడిప్పుడే కోలుకొని తాను మామూలు మనిషిని అవుతున్నట్లు వివరించారు. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.
నజ్రియ భర్త ఫహద్ ఫాజిల్ ఇటీవల పుష్ప-2 సినిమాలో విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగలూరు డేస్ సినిమాలో నజ్రియ, ఫహద్ కలిసి నటించారు. ఈ సినిమాతో ఏర్పడిన వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం సినిమాలకు దూరమైన నజ్రీయ.. ఆ తర్వాత మళయాలం సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. తాజాగా ఆమె పెట్టిన పోస్టులు చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక నజ్రియా పోస్ట్ పై స్టార్ హీరోయిన్ సమంత రెస్పాండ్ అయ్యింది. తన పోస్టుకు లవ్ సింబల్ కామెంట్ చేసింది. తాజా పరిణామాలు చేసిన తర్వాత, నజ్రీయ, ఫహద్ మధ్య విభేదాలు నడుస్తున్నాయా? విడాకులు తీసుకోబోతున్నారా అన్న రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి.