ఫహాద్ ఫాజిల్ భార్యకు విడాకులు ఇస్తున్నారా? నజ్రియా నజీమ్ ఎమోషన్ పోస్ట్ ఏంటంటే?
నాలుగు నెలలకు పైగా సోషల్ మీడియాలోనూ కనిపించలేదు నటి నజ్రియా నజీమ్. తాను మానసికంగా ఇబ్బందిపడుతున్నట్టు పెట్టిన పోస్ట్ కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఫాహద్ తో ఏమైనా గొడవలు వచ్చాయా అని చర్చించుకుంటున్నారు అభిమనాలు. అసలు సంగతేంటి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నజ్రియా చిత్రాలు
తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినా, నజ్రియాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన నజ్రియా, ఇటీవల కొన్ని మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన 'సినిమాలన్నీ మంచి ఆదరణ పొందాయి.
నజ్రియా ప్రకటన:
నజ్రియా నాలుగు నెలలకు పైగా కనిపించకపోవడంపై ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణ చెబుతూ ప్రకటన విడుదల చేశారు. "గత కొన్ని నెలలుగా నేను మానసికంగా బాగాలేను. వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నాను. నా 30వ పుట్టినరోజు, కొత్త సంవత్సరం, 'కొత్త సినిమా' విజయాన్ని మీతో పంచుకోలేకపోయాను. నేను సోషల్ మీడియాలో ఎందుకు లేను, కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదో స్నేహితులకు వివరించలేదు. నన్ను సంప్రదించడానికి ప్రయత్నించిన నా స్నేహితులందరికి సారి చెపుతున్నాను అని అన్నారు.
కేరళ చలనచిత్ర విమర్శకుల అవార్డుల్లో నజ్రియాకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఈ గుర్తింపుకు ధన్యవాదాలు. ఇది కఠినమైన ప్రయాణం. ప్రతిరోజూ నేను మెరుగవుతున్నాను. పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. కానీ నేను తిరిగి వస్తానని హామీ ఇస్తున్నాను అని ఆమె అన్నారు.
నజ్రియా క్షమాపణ:
ఇలా చేసినందుకు కుటుంబం, స్నేహితులు, అభిమానులకు వివరణ ఇవ్వాలనుకున్నాను. అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు" అని నజ్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆమె ఏ సమస్య ఉందో చెప్పకపోవడంతో, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అభిమానులు భావిస్తున్నారు.
ఇక నజ్రియా ఈ సందర్భంగా తన భర్త ప్రస్తావన తీసుకురాకపోవడంతో వీరిమధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? విడాకులు తీసుకోబోతున్నారా అని కొంత మంది ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అందుకే ఆమె ఒత్తిడికి లోనయ్యారేమో అని అంటున్నారు. మరి నిజం ఏంటో తెలియాల్సి ఉంది.