MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • MI vs SRH : ముంబైని జాకీపెట్టి లేపిన విల్ జాక్స్... అయితేనే ఎస్‌ఆర్‌హెచ్ పై ఎంఐ గెలుపు

MI vs SRH : ముంబైని జాకీపెట్టి లేపిన విల్ జాక్స్... అయితేనే ఎస్‌ఆర్‌హెచ్ పై ఎంఐ గెలుపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదికయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడ్డ ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్ లో మరింత పైకి ఎగబాకింది ఎంఐ. ఇలా ముంబైని జాకీపెట్టి లేపాడు విల్ జాక్స్.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 17 2025, 11:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Indian Premier League 2025

Indian Premier League 2025

Indian Premier League 2025 : ఐపిఎల్ 2025 లో వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ మళ్ళీ గాడిలో పడింది. ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటముల ప్రయాణం కొనసాగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు గురువారం తలపడగా ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. హోంగ్రౌండ్ లో ఎంఐ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో రాణించిన ఎంఐ విజయాన్ని అందుకుంది. 

టాస్ గెలిచి మొదట బౌలింగ్ ను ఎంచుకున్నాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అతడి నిర్ణయం సరైనదే... భారీ హిట్టర్లతో నిండిన సన్ రైజర్స్ ను కేవలం 162 పరుగులకే నిలువరించగలిగారు. ఆ తర్వాత 18.1 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి ఈ లక్ష్యాన్ని చేధించారు. దీంతో ఎంఐ పాయింట్స్ టేబుల్ లో మరింత పైకి ఎగబాకింది. 

ముంబై విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో అదరగొట్టాడు. అతడి అద్భుత ప్రదర్శనే ముంబైని గెలిపించింది. బంతితో మ్యాజిక్ చేసిన విల్ జాక్స్ 3 ఓవర్లేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.  కీలకమైన హెడ్, ఇషాన్ కిషన్ వికెట్లను ఇతడే పడగొట్టాడు.

బ్యాటింగ్ విషయానికి వస్తే ముంబైలో టాప్ స్కోరర్ గా నిలిచాడు జాక్స్. లక్ష్య చేధనలో ముంబై కాస్త తడబడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన జాక్స్ కేవలం 26 బంతుల్లో 36 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసాడు. అతడి సూపర్ ఇన్నింగ్స్ తో ముంబై విజయం ఖాయమయ్యింది. ఇలా జాక్స్ ముంబైని జాకీ పెట్టి లేపిమరీ విజయాన్ని అందించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
MI vs SRH

MI vs SRH

 ముంబై ఇన్నింగ్స్ సాగిందిలా...

163 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభమే అందించారు. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 23 బంతుల్లో 31 పరుగులు, రోహిత్ శర్మ 16 బంతుల్లో 26 పరుగులు చేసారు. రోహిత్ ఔటవగానే క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.  

సూర్యకుమార్ యాదవ్ 15 బంతుల్లో 26 పరుగులు చేసాడు. కెప్టెన్  హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్లో సూపర్ బ్యాటింగ్ చేసాడు... అతడు కేవలం 9 బంతుల్లోనే 21 పరుగులు చేసాడు. ఇక చివరివరకు క్రీజులో వున్న తిలక్ వర్మ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడు 17 బంతుల్లో 21 పరుగులు చేసాడు. 

33
Abhishek Sharma

Abhishek Sharma

సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్ సాగిందిలా.. 

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ మంచి ప్రారంభమే అందించారు. హెడ్ తన స్టైల్ కు భిన్నంగా మెల్లగా ఆడాడు... అతడు 29 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేసాడు. 

 మొదటిమ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ తర్వాత తేలిపోతున్నాడు. గత నాలుగైదు మ్యాచుల్లో అతడు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతున్నాడు. ఈసారి కూడా కేవలం 2 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. మధ్యలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డితో కలిసి క్లాసేన్ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేసాడు. నితీష్ 21 బంతుల్లో 19 పరుగులు, క్లాసేన్ 28 బంతుల్లో 37 పరుగులు చేసారు.  చివర్లో అనికేత్ వర్మ 8 బంతుల్లో 18 పరుగులు, కమిన్స్ 4 బంతుల్లో 8 పరుగులు చేసారు. 

59 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోయింది. 68 పరుగులకు రెండోది, 82 పరుగులకు మూడోది, 113 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయారు. 136 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోగా అనికేత్ వర్మ, కమిన్స్ చివర్లో  మెరుపు బ్యాటింగ్ చేయడంతో 163 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై ముందు ఉంచగలిగారు. కానీ ఈ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది ముంబై జట్టు. 

  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
దంచుడే.. దంచుడు.. 30 బంతుల్లోనే సెంచ‌రీతో అభిషేక్ శర్మ విధ్వంసం
Recommended image2
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image3
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved