MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • తగ్గేదేలే అంటున్న బంగారం.. ఆల్ టైం గరిష్ఠంతో రేపో, మాపో.. రూ.లక్ష క్రాస్..!!

తగ్గేదేలే అంటున్న బంగారం.. ఆల్ టైం గరిష్ఠంతో రేపో, మాపో.. రూ.లక్ష క్రాస్..!!

రూ.లక్షకి చేరువ: బంగారం పరుగు ఆగడం లేదు. బుధవారం నాడు ఆల్ టైం గరిష్ఠం ధర నమోదు చేసి, రూ.లక్ష మార్కుకు దగ్గరైంది. అమెరికా-చైనాల మధ్య ముదురుతున్న సుంకాల యుద్ధం, అంతర్జాతీయ షేర్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, డాలర్ ఇండెక్స్ పడిపోవడం.. కారణాలు ఏవైతేనేం జనం పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుండటంతో పసిడి ధర రోజురోజుకీ చుక్కలు తాకుతోంది. 

1 Min read
Author : Anuradha B
| Updated : Apr 17 2025, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

నిన్న దేశరాజధాని దిల్లీ సహా ఇతర అన్ని నగరాల్లో బంగారం ధర చుక్కలు తాకింది. పది గ్రాముల 24 క్యారెట్ ధర ఏకంగా రూ.1,650రూపాయలు పెరిగి, రూ.98,100 గా నమోదైంది. మన హైదరాబాద్లో మాత్రం కాస్త తక్కువగా రూ.97,700 ధర పలికింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఇంకోవైపు వెండి సైతం పసిడితో పోటీ పడుతోంది. ఒక్కరోజులోనే రూ.1,900 పెరిగింది. ఇప్పుడు కేజీ వెండి ధర రూ.99,400. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు ధర 3,318 గరిష్ఠం నమోదైంది. ఈ జోరు చూస్తే బంగారం కంటే ముందే వెండినే రూ.లక్ష మార్కును దాటేలా ఉంది. 

33

అమెరికా, చైనాల మధ్య ఇంకా వార్ టారిఫ్ ఘర్షణ ముదిరేలా కనిపిస్తుండటం, స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత, డాలర్ ఇండెక్స్ సన్నగిల్లుతుండటం, అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న సంకేతాలు.. వెరసి పసిడి పరుగు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేడో, రేపో.. బంగారం రూ.లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనుక్కోవాలనుకుంటున్న సామాన్యులకు బంగారం అందనంత ధరలో ఉంటూ చుక్కలు చూపిస్తోంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
బంగారం
డొనాల్డ్ ట్రంప్
పర్సనల్ పైనాన్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image2
Post Office MIS: ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే ప్రతీ నెల మీ ఖాతాల్లోకి రూ. 16,650 వస్తాయి.. ఏం చేయాలంటే.?
Recommended image3
Foot Massager: మ‌సాజ్ కోసం ఎక్క‌డికి వెళ్లాల్సిన ప‌నిలేదు.. జ‌స్ట్ రూ. 4 వేల‌తో ఇంట్లోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved