టీం ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్, ధీరేంద్ర శాస్త్రితో క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబా బౌలింగ్ లో శిఖర్ బ్యాటింగ్ ఎలా సాగిందో తెలుసా?
Shikhar Dhawan meet Dhirendra Shastri: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం క్రికెట్ వార్తల్లో కంటే ఇతర వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. భార్యతో విడాకులు, కొత్త ప్రేయసితో చక్కర్లు ఇలా ధావన్ వ్యక్తిగత విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇలా క్రికెట్ కు దూరమయ్యాయని అనుకున్నాడో ఏమో మరోసారి బ్యాట్ పట్టి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఏకంగా ఓ బాబా బౌలింగ్ లో ధవన్ బ్యాటింగ్ చేయడం విశేషం.
శిఖర్ ధవన్ ఇటీవల ప్రముఖ ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ ధామ్ సర్కార్) ను కలిసారు. ఈ సందర్భంగా బాబాతో క్రికెట్ ఆడుతున్న వీడియోను ధవన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి కనిపించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ధవన్ ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని, ధీరేంద్ర శాస్త్రితో మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రితో క్రికెట్ ఆడారు. ఈ వీడియోపై ధావన్ అభిమానులే కాదు బాగేశ్వర్ ధామ్ సర్కార్ భక్తులు కూడా రియాక్ట్ అవుతున్నారు.
బాబాజీతో క్రికెట్ ఆట
ధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరేంద్ర శాస్త్రితో క్రికెట్ ఆడుతున్న వీడియో షేర్ చేశారు. వీడియోలో ధవన్ బ్యాటింగ్ చేస్తుంటే, శాస్త్రి బౌలింగ్ చేశారు. శాస్త్రి బౌలింగ్‌లో ధవన్ ఔటయ్యారు. శాస్త్రి బౌలింగ్‌ను అభిమానులు ప్రశంసించారు.
ధవన్ తన పోస్ట్‌లో "ధీరేంద్ర శాస్త్రిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సానుకూల దృక్పథం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆయనతో క్రికెట్ ఆడటం గొప్ప జ్ఞాపకం. జై శ్రీరాం! జై బజరంగ్ బలి!" అని రాసుకొచ్చారు.
ఆధ్యాత్మిక విషయాలపై నమ్మకం
ధవన్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు కావడానికి ముంబై వెళ్లారు. ఇటీవల తన ప్రియురాలితో కలిసి బాగేశ్వర్ ధామ్ సర్కార్ ధీరేంద్ర శాస్త్రి ఆశీర్వాదం తీసుకున్నారు. ధవన్ తరచూ పూజలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై బలమైన నమ్మకం ఉంది. ఆధ్యాత్మికత ద్వారా తన కొడుకుతో మాట్లాడగలనని చెప్పారు.