అమెరికా ప్రభుత్వం విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం ప్రపంచంపై పడుతోంది. ఇక అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థలపై కూడా అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వీసా నిబంధనల పేరుతో విద్యార్థులపై తీవ్ర చర్యలకు ట్రంప్ సర్కారు దిగుతోంది. అహ్మదబాద్‌లో ఏఐసీసీ రెండో రోజు సమావేశం జరగనుంది. ఈ రోజు ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

12:00 AM (IST) Apr 10
GT vs RR IPL 2025 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌పై 58 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ కు సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 36)ల నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ లు వచ్చాయి. దీంతో 217/6 పరుగుల భారీ స్కోరు చేసింది.
11:53 PM (IST) Apr 09
అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలపై టారీఫ్స్ వడ్డింపు విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. టారిఫ్‌ల గురించి ప్రపంచంలో గందరగోళం చెలరేగిన వేళ ఇది మంచివార్త.
పూర్తి కథనం చదవండి
11:42 PM (IST) Apr 09
ఐఐఎం అహ్మదాబాద్ 2025 సెప్టెంబర్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్‌ను స్టార్ట్ చేయనుంది. 60వ స్నాతకోత్సవంలో డైరెక్టర్ ప్రొఫెసర్ భరత్ భాస్కర్ ఈ మేరకు ప్రకటన చేసారు. అయితే ఈ క్యాంపస్ ఏ దేశంలో ఏర్పాటుచేయనున్నారో తెలుసా?
పూర్తి కథనం చదవండి11:20 PM (IST) Apr 09
చాలామంది తమ ఆధార్ కార్డును ఫోన్ కేసులో లేదంటే పర్సులో నిత్యం వెంట ఉండేలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో తెలియదు. ఇలా నిత్యం ఆధార్ కార్డును వెంటపెట్టుకుని తిరగడం కష్టమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సరికొత్త మొబైల్ యాప్ ను రెడీ చేసింది. దీన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లాంచ్ చేయగా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ఎలా పనిచేయనుందో తెలుసా?
పూర్తి కథనం చదవండి10:44 PM (IST) Apr 09
Manchu Manoj: మంచు మనోజ్ విలక్షణమైన నటన, పాత్రలతో తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు. ప్రస్తుతం బైరవ చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాల్లో హీరో, విలన్, లేడీ గెటప్‌లతో మెప్పించాడు మనోజ్. అయితే.. గత కొంతకాలంగా మనోజ్‌కి అతని అన్న విష్ణుకి పడట్లేదు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, దాడులకు దిగుతున్నారు. తాజాగా మనోజ్ మీడియా ముందుకు మరోసారి ప్రత్యక్షమయ్యారు. తన అన్న విష్ణు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. విష్ణు సినిమా కెరీర్ గురించి, మనోజ్ చేసిన త్యాగం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
10:37 PM (IST) Apr 09
Virat Kohli: 'టోర్నమెంట్ నిర్మాణాత్మకమైన విధానం కారణంగా ఐపీఎల్ మిమ్మల్ని చాలా ప్రత్యేకమైన రీతిలో సవాలు చేస్తుంది. ఇది చిన్న ద్వైపాక్షిక సిరీస్ లాంటిది కాదు.. ఇది చాలా వారాల పాటు కొనసాగుతుంది. పాయింట్ల పట్టికలో మీ స్థానం మారుతూ ఉంటుంది. ఆ మార్పు దృశ్యాలు మిమ్మల్ని అనేక రకాలుగా ఒత్తిడికి గురిచేస్తుందని' ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నాడు.
10:29 PM (IST) Apr 09
ఆంధ్ర ప్రదేశ్ లో ఓవైపు ఎండలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో కురుస్తున్న వర్షాలు వాతావరణాన్ని చల్లబర్చి కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురుస్తాయన్న కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఈసారి వర్షాలు ఎన్నిరోజులు కురవనున్నాయో తెలుసా?
పూర్తి కథనం చదవండి09:25 PM (IST) Apr 09
తెలుగు రాష్ట్రాల్లో రేపు(గురువారం) విద్యాసంస్థలకు సెలవు ఉందా? ఏప్రిల్ 10న ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కానీ ఈ సెలవు అందరికీ వర్తిస్తుందా అన్న డౌట్ విద్యార్థులకే కాదు పేరెంట్స్ కు ఉంది. అసలు రేపు విద్యాసంస్థలు నడుస్తాయో లేదో ఇక్కడ తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండి09:10 PM (IST) Apr 09
Thahawur Rana: ముంబయి నగరంపై 2008లో జరిగిన ఉగ్రమూకల దాడి గుర్తుకు తెచ్చుకుంటే ప్రతి భారతీయుడి మనసు చలించిపోతుంది. ఈ ఘటనలో 170 మంది పౌరులు మృతి చెందారు. అలాంటి ఘాతుకానికి ఓడిగట్టిన, దాడులు జరిపేందుకు ప్లాన్ చేసిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ కీలక నాయకుడు తహవూర్ రాణా భారత్‌కు తిరిగొస్తున్నాడు. ఇప్పటి వరకు అమెరికా జైల్లో శిక్షణ అనుభవిస్తున్న అతన్ని భారత్‌కు అప్పగించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది. గురువారం ఉదయానికి తహవూర్ రాణా ఇండియాకు తీసుకొస్తున్నట్లు భద్రతాదళాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రముఖ నగరాల్లో ఎక్కడా అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక తహవూర్ రాణా చరిత్ర చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. భయంకరమైన తీవ్రవాదిని భారత్ ఏం చేస్తుందంటే..
పూర్తి కథనం చదవండి07:58 PM (IST) Apr 09
సీఎన్‌జీ కార్లు మంచి మైలేజ్ ఇస్తాయి, కానీ బూట్ స్పేస్ తగ్గడం పెద్ద సమస్య. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఫుల్ బూట్ స్పేస్‌తో సీఎన్‌జీ కార్లను ప్రవేశపెట్టాయి. ఆ కార్లు, వాటి బూట్ స్పేస్ గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:28 PM (IST) Apr 09
Astrology: ఏప్రిల్ 10న మృగశిర నక్షత్రంలోకి గురుగ్రహ సంచారం జరగనుంది. దేవగురు బృహస్పతి నక్షత్రంలో మార్పు కారణంగా సింహరాశితో సహా 5 రాశులవారికి అదృష్టం కలగనుంది. మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం ఏ రాశుల వారు అదృష్టంతో పాటు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
07:26 PM (IST) Apr 09
అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న రెట్ట తల సినిమాలో ధనుష్ ఒక పాట పాడారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
పూర్తి కథనం చదవండి07:18 PM (IST) Apr 09
డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగారు. ఆయన సినిమాలకు, శంకర్ సినిమాలకు ఉన్న పోలికల గురించి చూద్దాం.
పూర్తి కథనం చదవండి07:09 PM (IST) Apr 09
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం మెరుగుపడిందనే చెప్పాలి. దీంతో మన దేశానికి అంతర్జాతీయ వేదికలపై తగిన గౌరవం దక్కుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ప్రధాని మోదీని తమ దేశానికి మరోసారి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం ఎందుకో తెలుసా?
06:43 PM (IST) Apr 09
Ram charan-Upasana: రాంచరణ్ కొణిదెల, ఉపాసన కొణిదెల ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సంపన్న కుటుంబాల్లో పుట్టినప్పటికీ సమాజంలో కట్టుబాట్లు, విలువలు పాటిస్తూ ఎంతో అన్యోనంగా ఉంటున్నారు. చానాళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. ఆమెను అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఇక చరణ్‌ది సినిమా ప్రపంచం.. ఉపాసనది వ్యాపార సామ్రాజ్యం... అసలు ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకునే సమయం ఎప్పుడు దొరుకుంది అని చాలామందికి డౌట్. మరి ఆ సీక్రెట్‌ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పేసిందండోయ్.. అదేంటో తెలుసుకుందామా..
పూర్తి కథనం చదవండి06:14 PM (IST) Apr 09
నమ్మిన వారిని ద్రోహం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఒక వ్యక్తి మనల్ని నమ్మారంటే ఎట్టి పరిస్థితుల్లో దానిని వమ్ము చేయకూడదు. నమ్మకద్రోహం చేసిన వ్యక్తి ఎంతటి శిక్ష ఎదుర్కొంటాడో చెప్పే ఒక నీతి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
06:12 PM (IST) Apr 09
మనం కొత్త కారు కొంటే దాని రిజిస్ట్రేషన్ కోసం ఎంత ఖర్చు చేస్తాం... నాలుగైదు వేలతో పని అయిపోతుంది. మహా అయితేే పదివేలు ఖర్చవుతుందేమో. కానీ ఓ వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా రూ.45 లక్షలు ఖర్చుచేసారట. ఫార్చ్చూనర్, బిఎండబ్ల్యూ, బెంజ్ కార్ల కంటే ఈ రిజిస్ట్రేషన్ నంబరే కాస్ట్లీ. ఇంత ధర పలికిన ఆ నంబర్ ఏదో తెలుసా?
పూర్తి కథనం చదవండి05:57 PM (IST) Apr 09
Second Solar Eclipse 2025: మొదటి సూర్యగ్రహణం లాగే, ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం కూడా ఇండియాలో కనిపించదు. 2025లో వచ్చే రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా నుండి అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే, ఈ రెండో సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది? భారత్ లో కనిపించే ప్రభావం సహా మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
05:42 PM (IST) Apr 09
Mark Shankar: పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. సింగపూర్‌కి సమ్మర్ క్యాంపు కోసం వెళ్లిన మార్క్ శంకర్ అక్కడి పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఊపిరి తీసుకోవడంలో తొలుత కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈవిషయం తెలుసుకున్న వెంటనే నిన్న రాత్రి పవన్ కల్యాణ్, మెగస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ సింగపూర్ వెళ్లారు. మరోవైపు పవన్ అభిమానులు, జనసేన క్యాడర్ అనేక ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఎట్టకేలకు వారి పూజలు ఫలించాయి. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి ఏంటంటే..
04:46 PM (IST) Apr 09
వేసవిలో ఎక్కువగా కనిపించే పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మండుటెండల్లో పుచ్చకాయ తింటే కడుపు హాయిగా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కల్తీ కాలంలో పుచ్చకాయలను కూడా కల్తీగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంటి కల్తీ పుచ్చకాయలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ కల్తీ పుచ్చకాయలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
04:32 PM (IST) Apr 09
Manoj: మంచు మనోజ్, విష్ణుకి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. గతంలో మనోజ్ ఇంటికి కరెంట్ సరఫరా కట్ చేయడం, నీళ్ల మోటార్‌లో పంచదార వేయడం వంటివి విష్ణు చేస్తున్నాడని మనోజ్ ఆరోపించాడు. రీసెంట్‌గా తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్లి అక్కడ ఇద్దరి మధ్య ఘర్షన జరిగి కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. ఇక తాజాగా మనోజ్ ఉంటున్న ఇంట్లోకి ఎవరూ లేని సమయంలో విష్ణు తన మనుషులను పంపి.. తన చిన్న పాప నగలు, బట్టలు, భార్య కార్లను ఎత్తుకెళ్లారని మనోజ్ ఆరోపిస్తున్నారు. అసలు ఈ ఇద్దరూ చిన్నపిల్లల్లా రోడ్డుపైకి వచ్చి ఎందుకు గొడవలు పడుతున్నారో మీకు తెలుసా..
04:12 PM (IST) Apr 09
ఓవైపు ఎండ భగ్గుమంటోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఎండ తీవ్రత ఓ రేంజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత వారంలో కురిసన వర్షాలతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పాలి. అయితే తిరిగి మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఇదే తరుణంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం, గురువారం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
04:12 PM (IST) Apr 09
ఏ కంపనీ అయినా ఉద్యోగులతో బాగా పనిచేయించుకునేందుకు ప్రయత్నిస్తాయి. జీతం ఎంత తక్కువయితే అంత తక్కువ ఇచ్చి పనిమాత్రం ఎంత ఎక్కువయితే అంత ఎక్కువ చేయించుకుంటాయి. కానీ ప్రస్తుతం గూగుల్ కొందరు ఉద్యోగులకు పని చేయకుండా ఉండేందుకు భారీగా సాలరీ ఇస్తోందట. టెక్ దిగ్గజం ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా?
పూర్తి కథనం చదవండి02:35 PM (IST) Apr 09
ఆంధ్రప్రదేశ్‌లోని కార్ల తయారీ సంస్థ కియా ప్లాంట్‌లో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా 900 కార్ల ఇంజన్లు దొంగతనానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులకు మార్చి 19వ తేదీన ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ ఇంజన్లు ఏమయ్యాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
02:03 PM (IST) Apr 09
NTR-Prashanth Neel: యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీయబోయే సినిమాకి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో స్టోరీ దగ్గరి నుంచి నటీనటుల ఎంపిక, యాక్షణ్ సీక్వెన్స్‌కి పనిచేసే టెక్నీషియన్లు ఇతర అంశాలపై దర్శకుడు పక్కాగా ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఆ చిత్రంలో హృతిక్ రోహన్ హీరోగా ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ప్రశాంత్ నీల్ చిత్రానికి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది.
01:59 PM (IST) Apr 09
రష్మిక మందన్న ఇప్పుడు పాన్-ఇండియా హీరోయిన్లలో ఒకరిగా నిలదొక్కుకుంది. తన అందం, టాలెంట్, నటనతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ దూసుకుపోతోంది. కొద్ది సంవత్సరాల్లోనే, ఆమె ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసింది.
పూర్తి కథనం చదవండి01:54 PM (IST) Apr 09
టెక్నాలజీ రోజురోజుకీ పెరుగుతోంది. ఊహకందని విధంగా సాంకేతికత వృద్ధి చెందుతోంది. ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే రోజులు వచ్చేశాయ్. క్విక్ కామర్స్ రాకతో కేవలం 10 నిమిషాల్లోనే వస్తువులు ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇక వాయిస్ అసిస్టెంట్‌లు కూడా సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టాయి. అయితే టెక్నాలజీ మనుషులకు ఎంత మేలు చేస్తుందో అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వార్త తాజా మరోసారి వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
01:25 PM (IST) Apr 09
హైదరాబాదీలకు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో మరోసారి బైటపడింది. కేవలం ఒక్క నెలలోనే నగరంలో హలీం విక్రయాలు ఊహించని స్థాయిలో జరిగాయి. యావత్ దేశాన్నే ఆశ్చర్యానికి గురిచేసేలా నగరంలో హలీం బిజినెస్ జరిగింది. పదువు, వందలు కాదు ఏకంగా వేలకోట్లను హలీం కోసం ఖర్చుచేసారు హైదరబాదీలు.
పూర్తి కథనం చదవండి12:53 PM (IST) Apr 09
ys jagan: ఏపీలో కూటమి పార్టీ నాయకులకు, అటు వైసీపీ నేతలకు మధ్య గత కొంతకాలంగా అనేక చోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన గొడవల్లో రాప్తాడు నియోజకవర్గంలో కురుబ లింగమయ్య అనే వైపీసీ నాయకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు సర్కారు, పోలీసులు తీరుపై తీవ్రస్థాయిలో జగన్ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవాలు పక్కనపెడితే.. జగన్ మాట్లాడిన తీరుపై ఓ ఎస్సై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే?
12:15 PM (IST) Apr 09
మీరు రుణం తీసుకున్నారా.? మీకోసమే భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో రుణాలు తీసుకున్న వారికి రెండోసారి ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 0.25 శాతం (0,25%) లేదా 25 బేసిస్ పాయింట్లు (25 bps) తగ్గిస్తూ మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 6.25 శాతంగా ఉన్న రెపోరేటు 6.00 శాతానికి తగ్గనుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులకు ఎలాంటి లాభం చేకూరనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
12:04 PM (IST) Apr 09
IPL Nicholas Pooran vs Andre Russell: నికోలస్ పూరన్ 36 బంతుల్లో అజేయంగా 87 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడటంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని అందుకుంది. పూరన్ తన సునామీ ఇన్నింగ్స్ తో 2,000 ఐపీఎల్ పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో పూరన్ సిక్సర్ల మోత మోగిస్తూ ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ ను దంచికొట్టాడు.
పూర్తి కథనం చదవండి11:32 AM (IST) Apr 09
మందు బాబులకు గుడ్ న్యూస్, త్వరలో సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు స్టార్ట్ అయ్యే పరిస్థితి రాబోతోంది. అందుకోసం పర్మీషన్ కూడా అడిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వియం వివాదం అవుతోంది. మరి థియేటర్లలో మధ్యం అమ్మకాలకు అనుమతి వస్తుందా? అసలు విషయం ఏంటి?
పూర్తి కథనం చదవండి11:05 AM (IST) Apr 09
'లక్ష్మీ నివాస' సీరియల్ నటి మానస మనోహర్ ఫ్యామిలీ గోవాకి వెళ్ళింది. ఆ ఫోటోలని నటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పూర్తి కథనం చదవండి10:59 AM (IST) Apr 09
Gold And Silver Price: చుక్కలు చూపించిన బంగారం ధరలు క్రమంగా నేలకు దిగొస్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తులం రూ. లక్షకు చేరడం ఖాయమని అంతా భావించారు. ఇక బంగారం కొనడం కలే అనుకున్నారు. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, స్టాక్ మార్కెట్ పతనం ఇలా పలు రకాల కారణాలతో బంగారం ధరలు నేల చూపు చూస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తులం బంగారంపై ఏకంగా రూ. 3450 తగ్గడం విశేషం. మరి బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి10:40 AM (IST) Apr 09
IPL 2025 PBKS vs CSK: ఐపీఎల్ 2025 21వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో 4 పరుగుల తేడాతో ఎల్ఎస్జీ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల బ్యాట్స్‌మెన్లు పరుగుల వరదపారించారు. ఇరు జట్ల బౌలింగ్ ను దంచికొట్టారు. అయితే, ఈ మ్యాచ్ లో శార్థుల్ ఠాగూర్ ఒక ఓవర్ లో ఏకంగా 11 బంతులు వేశాడు. ఒక ఓవర్ కు 6 బంతులే కదా.. మరి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:33 AM (IST) Apr 09
Swiggy Max Saver: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసింది. ఇప్పటికే ఫుడ్ డెలివరీతోపాటు నిత్యావసర సరుకులను కూడా స్వీగ్వీ అందిస్తోంది. వీటితోపాటు సుమారు 35,000 రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు మరో జెప్టో సంస్థ సూపర్ సేవర్ అనే పేరుతో రోజుకో ఆఫర్‌ని ఇస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మార్కెట్లో ఈ పోటీని తట్టుకునేలా స్విగ్వీ కూడా మ్యాక్స్ సేవర్ పేరుతో బంపర్ ఆఫర్, వినియోగదారులకు మెరుగైన రవాణా సదుపాయంతోపాటు భారీ డిస్కౌంట్‌లు ఇచ్చేందుకు సిద్దమైంది. మరి ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది? ఆఫర్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి10:29 AM (IST) Apr 09
ఏమంటూ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడో ఆ రోజు నుంచి ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. మొన్నటి వరకు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని తిరిగి పంపించే పని పెట్టుకున్న ట్రంప్ ఇప్పుడు టారిఫ్‌ల రచ్చకు తెర తీశాడు. ప్రపంచ దేశాలపై ఎడాపెడా సుంకాలను పెంచేశాడు. ప్రతీకార సుంకం పేరుతో ప్రపంచంపై బాంబు పెల్చేశాడు. దీంతో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నడుమ ట్రేడ్ వార్ జరగనుందా.? అన్న ప్రశ్న వస్తోంది. ట్రంప్ దెబ్బకు ఏం జరగనుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..