- Home
- Election
- Telangana Elections
- Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు
Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు
ఓవైపు ఎండ భగ్గుమంటోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఎండ తీవ్రత ఓ రేంజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత వారంలో కురిసిన వర్షాలతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పాలి. అయితే తిరిగి మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఇదే తరుణంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం, గురువారం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rain Alert
తెలంగాణలో పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు ఈదుగు గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి.
బుధవారం భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇందులో భాగంగానే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ చేసింది.
Rain
సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక గురువారం సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
Heavy Rain Alert
బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండకూదని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు అటు వెంటనే వర్షాలు కురుస్తుండడంతో అనారోగ్యాలు ప్రభలే అవకాశం ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు.