- Home
- Andhra Pradesh
- ys jagan: చొక్కా ఊడదీయడానికి నువ్వెవడంటూ జగన్‌కి ఎస్సై స్ట్రాంగ్ రిప్లై.. జగన్ టార్గెట్ పోలీసులేనా?
ys jagan: చొక్కా ఊడదీయడానికి నువ్వెవడంటూ జగన్‌కి ఎస్సై స్ట్రాంగ్ రిప్లై.. జగన్ టార్గెట్ పోలీసులేనా?
ys jagan: ఏపీలో కూటమి పార్టీ నాయకులకు, అటు వైసీపీ నేతలకు మధ్య గత కొంతకాలంగా అనేక చోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన గొడవల్లో రాప్తాడు నియోజకవర్గంలో కురుబ లింగమయ్య అనే వైపీసీ నాయకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు సర్కారు, పోలీసులు తీరుపై తీవ్రస్థాయిలో జగన్ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవాలు పక్కనపెడితే.. జగన్ మాట్లాడిన తీరుపై ఓ ఎస్సై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే?

YS Jagan
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇటీవల అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రీసెంట్‌గా గుంటూరులో మిర్చి యార్డును సందర్శించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరుగా తిరుపతి వెళ్లి బాధిత కుటుంబాలను పలకరించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపారు. దీంతోపాటు ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయిని సందర్బంలో కూడా విజయవాడ జైలులో ఉన్న వంశీని జగన్ వెళ్లి కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు. ఈ నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గంలో కార్యకర్త మృతి చెందటంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
YS Jagan
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఏపీ పరిస్థితి ఒకప్పటి బీహార్‌ను తలపిస్తోందని జగన్ ఫైర్ అయ్యారు. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి పార్టీకి స్థానిక సంస్థల్లో సంఖ్యా బలం లేకున్నా.. గొడవలు, దాడులు, బెదిరింపులకు పాల్పడి గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని జగన్ తెలిపారు. దీనిలో భాగంగానే శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్యను బైక్‌పై వెళ్తుండగా.. బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేశారని ఆయన ఆరోపించారు.
ys jagan
ఇక రామగిరికి చెందిన ఎస్సై సుధాకర్ వైసీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని జగన్ ఆరోపించారు. పోలీసు వాహనంలో వచ్చి ఎమ్మెల్యేతో వీడియోకాల్ చేయించడం వైసీపీ నాయకులను బెదిరించడం, కేసులు పెట్టడం ఎస్సై పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులకు మరోసారి జగన్ వార్నింగ్ ఇచ్చారు. అధికారపార్టీకి కొమ్ముకాసి ఇబ్బందులకు గురిచేస్తే.. పోలీసుల బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతానని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని ఈ విషయం తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని పోలీసులను హెచ్చరించారు. ఎక్కువ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు పోలీసులను సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెడతామని వార్నింగ్ ఇచ్చారు జగన్.
ys jagan ap police
పోలీసులపై చేసిన ఆరోపణలపై రామగిరి ఎస్సై సుధాకర్ మాజీ సీఎం జగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. నిజాయతీతో ప్రజలపక్షాన పనిచేసేందుకు తాము పోలీసు డ్రస్సులో ఉన్నామని అన్నారు. బట్టలు ఊడదీసి కొడతాం అని ఎవడు పడితే, ఏదిపడితే అది వాగడం సరికాదన్నారు. కష్టపడి రన్నింగ్ రేస్‌లో పాస్ అయ్యి, పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుని వేయంచకున్న యానిఫాం తొడుక్కున్నామని ఎసై చివాట్లు పెట్టారు. నువ్వు వచ్చి ఊడదీయడానికి ఖాకీ చొక్కా అనుకున్నావా.. అరటి పండు తొక్క అనుకున్నావా జగన్ అంటూ ఓ వీడియోలో మాట్లాడుతూ.. సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు ఎస్సై సుధాకర్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కూటమి పార్టీల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రీసెంట్‌గా పోలీసులు జగన్‌కు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఈ ఘటనలన్నీ చూస్తుంటే ఇప్పుడల్లా పోలీసులపై జగన్ పగ చల్లారాలే కనిపించడం లేదు.