MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • NTR-Prashanth Neel: ఎన్టీఆర్‌, నీల్‌ చిత్రంపై బిగ్‌అప్డేట్‌.. షూటింగ్‌ డేట్‌ ఫిక్స్‌, రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

NTR-Prashanth Neel: ఎన్టీఆర్‌, నీల్‌ చిత్రంపై బిగ్‌అప్డేట్‌.. షూటింగ్‌ డేట్‌ ఫిక్స్‌, రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

NTR-Prashanth Neel: యంగ్‌ టైగర్‌ జూనియర్‌ యన్టీఆర్‌తో కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తీయబోయే సినిమాకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో స్టోరీ దగ్గరి నుంచి నటీనటుల ఎంపిక, యాక్షణ్‌ సీక్వెన్స్‌కి పనిచేసే టెక్నీషియన్లు ఇతర అంశాలపై దర్శకుడు పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారంట. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వార్‌-2 సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఆ చిత్రంలో హృతిక్‌ రోహన్‌ హీరోగా ఎన్టీఆర్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో ప్రశాంత్‌ నీల్‌ చిత్రానికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది.   

2 Min read
Author : Bala Raju Telika
Published : Apr 09 2025, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
NTR Prashanth Neel Movie Update: Shooting Starts on April 22, Release Expected for Sankranti 2026

NTR-Prashanth Neel Movie Update: Shooting Starts on April 22, Release Expected for Sankranti 2026

యంగ్‌ టైగర్‌ ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోతాడు అన్న విషయం తెలిసిందే. సెంటిమెంట్‌, యాక్షణ్‌, అతని కామెడీ టైమింగ్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే.. ఆర్‌ ఆర్‌ ఆర్‌ తర్వాత ఇంటర్నేషనల్‌ ఫేమ్‌ రావడంతో తర్వాతి చిత్రాలకు కూడా కథలను ఆ రేంజ్‌లోనే ఎంపిక చేసుకుంటున్నాడు. టాలీవుడ్‌ కంటే.. బాలీవుడ్‌, హాలీవుడ్‌పై తారక్‌ కన్నేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఇప్పుడు నటించబోతున్న చిత్రాలే  ఆ విషయాన్ని చెబుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
NTR-Prashanth Neel Movie Update: Shooting Starts on April 22, Release Expected for Sankranti 2026

NTR-Prashanth Neel Movie Update: Shooting Starts on April 22, Release Expected for Sankranti 2026

బాలీవుడ్‌ చిత్రం వార్ 2 సినిమా షూటింగ్‌లో తారక్‌ బిజీగా ఉన్నారు. ముంబైయ్‌లోనే ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. డ్రగ్స్‌ మాఫియా అంశంపై తీస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా తారక్‌ నటిస్తుండటంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ సన్నబడ్డాడు.. చూడ్డానికి కరెంట్‌ తీగలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కావస్తుండటంతో.. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. షూటింగ్‌ ఈ నెలలోనే ప్రారంభిస్తామని మూవీ నిర్మాతలు ప్రకటించేశారు. 

35

ఎన్టీఆర్‌ దర్శకుడు నీల్ చిత్రం షూటింగ్‌ ప్రారంభమయ్యే తేదీ వచ్చేసింది. ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి తారక్‌ సెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ ప్రకటించేశారు. ఇప్పటికే కొన్ని యాక్షణ్‌ సన్నివేశాలను రామోజీ ఫిల్మసిటీలో తీశారు. అయితే.. ఈ నెల 22 నుంచి రెగ్యులర్‌ షెడ్యూల్స్‌లో చకచకా సినిమా తీసేందుకు యూనిట్‌ సిద్దమైంది. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది జనవరి సంక్రాంతి సందర్బంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. 

45
NTR-Prashanth Neel Movie Update: Shooting Starts on April 22, Release Expected for Sankranti 2026

NTR-Prashanth Neel Movie Update: Shooting Starts on April 22, Release Expected for Sankranti 2026

తారక్‌, నీల్‌ కాంబోలో వస్తున్న చిత్రానికి డ్రాగన్‌ అని వర్కిల్‌ టైటిల్‌ పెట్టినట్లు సమాచారం. త్వరలో పేరుని ఫిక్స్‌ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలో ఎన్టీఆర్‌ మూడు పాత్రలో కనిపిస్తారని టాక్‌ నడుస్తోంది. చైనీస్ గ్యాంగ్‌స్టర్ నుంచి ప్రేరణ పొందిన ఓ మాఫియా డాన్ పాత్రతో తారక్‌ సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

 

55
Jr NTR

Jr NTR

తారక్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇప్పటికే వార్‌-2 నటిస్తున్న ఆయన.. తర్వాత చిత్రం ప్రశాంత్‌నీల్‌తో ఉంది. రీసెంట్‌గా దేవర-2 కూడా కచ్చితంగా ఉంటుందని ప్రకటించేశారు. మరోవైపు దర్శకుడు సుకుమార్‌తో ఇటీవల ఓ క్లోజ్‌ షాట్లో ఎన్డీఆర్‌ కనిపించాడు. సుకుమార్‌పై ప్రేమతో అని క్యాప్షన్‌ కూడా జోడించారు. దీంతో సుక్కూతో కూడా తారక్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నీల్‌ తీయబోయే డ్రాగన్‌ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ సంచలనం చేస్తారన్న టాక్‌ నడుస్తోంది. దర్శకుడు రాజమౌలి తీసినట్లే భారీ సెట్టింగ్‌లు, మంది మార్భలంతో సినిమాలు తీస్తున్నాడు నీల్‌. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
తెలుగు సినిమా
తమిళ సినిమా
హాలీవుడ్
బాలీవుడ్
ప్రశాంత్ నీల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved