MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • GT vs RR : సాయి సుదర్శన్ సూపర్ షో.. రాజస్థాన్ పై గుజరాత్ సూపర్ విక్టరీ

GT vs RR : సాయి సుదర్శన్ సూపర్ షో.. రాజస్థాన్ పై గుజరాత్ సూపర్ విక్టరీ

GT vs RR IPL 2025 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌పై 58 పరుగుల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ కు సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 36)ల నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ లు వ‌చ్చాయి. దీంతో 217/6 పరుగుల భారీ స్కోరు చేసింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 10 2025, 12:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sai Sudarshan

Sai Sudarshan

GT vs RR IPL 2025 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్సీలోని గుజ‌రాత్ టైటాన్స్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ మ‌రోసారి ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో భారీ విజ‌యాన్ని అందుకుంది.  సంజూ శాంస‌న్ కెప్టెన్సీలోని రాజ‌స్థాన్ టీమ్ పై ఏకంగా 58 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ విజ‌యాన్ని అందుకుంది.  

ఐపీఎల్ 2025 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో త‌ల‌ప‌డింది. బుధవారం (ఏప్రిల్ 9) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కు ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఇది ఇది నాలుగో గెలుపు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. కాగా, గత 5 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది మూడో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆర్ఆర్ ఏడో స్థానంలోకి చేరుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంస‌న్ మొదట ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. భారీ టార్గెట్ లో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్థాన్ వరుస రెండు విజయాల పరంపరకు అహ్మదాబాద్‌లో బ్రేక్ పడింది. 

గుజ‌రాత్ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ సూపర్ నాక్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే, జోస్ బట్లర్ 36, షారుక్ ఖాన్ 36 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2, తీక్షణ 2 వికెట్లు తీసుకున్నారు.

భారీ టార్గెట్ ఛేదనలో రాజస్థాన్ కు మంచి శుభారంభం లభించలేదు. జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 6 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సంజూ శాంసన్ 41, రియాన్ పరాగ్ 26, హిట్మేయర్ 52 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు కానీ, జట్టుకు విజయాన్ని అందించే వరకు క్రీజులో నిలబడలేకపోయారు. 

34

గుజ‌రాత్ గెలుపులో హీరోగా సాయి సుద‌ర్శ‌న్ 

గుజరాత్ గెలుపులో యంగ్ ప్లేయ‌ర్ సాయి సుదర్శన్ హీరోగా నిలిచాడు. మ‌రోసారి అద్బుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. అత‌ను 53 బంతుల్లో 82 పరుగుల ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది మూడో హాఫ్ సెంచరీ. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో  సాయి సుద‌ర్శ‌న్ రెండవ స్థానానికి చేరుకున్నాడు. అతను 5 మ్యాచ్‌ల్లో 273 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని సగటు 54.60, 151.67 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. మొత్తంగా 16 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. 

 

44

గత రెండు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లను రాజ‌స్థాన్ ఓడించింది. ఈ సీజన్‌లో ఆర్ఆర్ కు ఇది మూడో ఓటమి. దీనికి ముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు, గుజరాత్ వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన తర్వాత, వారు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్‌లను ఓడించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved