MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శంకర్‌ను అట్లీ కాపీ కొడుతున్నారా? అల్లు అర్జున్ మూవీ విషయంలో స్ట్రాటజీ ఇదే..

శంకర్‌ను అట్లీ కాపీ కొడుతున్నారా? అల్లు అర్జున్ మూవీ విషయంలో స్ట్రాటజీ ఇదే..

డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగారు. ఆయన సినిమాలకు, శంకర్ సినిమాలకు ఉన్న పోలికల గురించి చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 09 2025, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

డైరెక్టర్ అట్లీ శంకర్ స్ట్రాటజీని కాపీ కొట్టారా?: తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగిన వారిలో అట్లీ (Atlee) ఒకరు. డైరెక్టర్ శంకర్ దగ్గర రోబో, స్నేహితుడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ, ఆ తర్వాత రాజా రాణి సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత విజయ్‌తో తెరి, మెర్సల్, బిగిల్ (Bigil) లాంటి హ్యాట్రిక్ హిట్ సినిమాలు తీశాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ మొదటి సినిమానే షారుఖ్‌ఖాన్‌తో తీసి వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
శంకర్, అట్లీ

శంకర్, అట్లీ

అట్లీ అద్భుత ఎదుగుదల

కేవలం 5 సినిమాలు మాత్రమే తీసిన అట్లీ తన 6వ సినిమా కోసం రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే డైరెక్టర్‌గా ఎదిగాడు. రాజమౌళి తర్వాత ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే డైరెక్టర్ ఎవరంటే అది అట్లీనే. అట్లీ గురువైన శంకరే ఒక సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారు. ఆయన కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అట్లీ. ఆయన డైరెక్షన్‌లో త్వరలో రాబోయే సైన్స్ ఫిక్షన్ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

 

34
అట్లీ వర్సెస్ శంకర్

అట్లీ వర్సెస్ శంకర్

శంకర్ బాటలో అట్లీ

డైరెక్టర్ అట్లీ, శంకర్‌ను కాపీ కొట్టే తక్కువ సమయంలోనే అద్భుతమైన ఎదుగుదల సాధించాడని నెటిజన్లు పోలుస్తున్నారు. డైరెక్టర్ శంకర్ (Director Shankar) తన ప్రారంభంలో ప్రేమ కథా చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అట్లీ డైరెక్టర్‌గా రాజా రాణి అనే ప్రేమ కథతోనే ఎంట్రీ ఇచ్చాడు. అదేవిధంగా శంకర్ నెమ్మదిగా సామాజిక సందేశాత్మక కమర్షియల్ సినిమాలు తీయడం ప్రారంభించాడు. 

అట్లీ కూడా తెరి సినిమాలో మహిళల భద్రత గురించి, మెర్సల్‌లో వైద్య రంగంలో జరిగే అవినీతి గురించి, బిగిల్ సినిమాలో ఆటల్లో రాణించాలని తపించే మహిళల గురించి, జవాన్‌లో రైతుల సమస్యల గురించి ఇలా సామాజిక సందేశాత్మక సినిమాలు తీసి తనను తాను టాప్ డైరెక్టర్‌గా నిలబెట్టుకున్నాడు.

44
అట్లీ గురువు శంకర్

అట్లీ గురువు శంకర్

గురువును కాపీ కొడుతున్న శిష్యుడు

ఇందులో మరో హైలైట్ ఏమిటంటే, శంకర్ చేసిన తప్పులన్నింటినీ అట్లీ చేయలేదు. టాప్ నటులతో సినిమాలు తీస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కొత్త నటులతో బాయ్స్ అనే సినిమా తీశాడు శంకర్. ఆ సినిమా ఆయనకు కలిసి రాలేదు. అందుకే అట్లీ అలాంటి రిస్క్ తీసుకోలేదు. 

ఇప్పుడు త్వరలో శంకర్ లాగే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అట్లీ. శంకర్ రజనీకాంత్‌తో కళానిధి మారన్ నిర్మాణంలో రోబో అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను తీసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచినట్లుగానే, అదే కళానిధి మారన్ నిర్మాణంలో అల్లు అర్జున్‌తో అట్లీ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇది భారతీయ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లే సినిమాగా చెబుతున్నారు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి
Recommended image2
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
Recommended image3
Narrow Escape: చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆరుగురు స్టార్లు, ఆ హీరోయిన్ కూడా.. అతడికి అదృష్టం మామూలుగా లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved