- Home
- Entertainment
- Manoj: కూతురు, భార్య బట్టలు, నగలు, కార్లు చోరీ.. కన్నీళ్లతో రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్.. ఏందిరయ్యా ఈ రచ్చ!
Manoj: కూతురు, భార్య బట్టలు, నగలు, కార్లు చోరీ.. కన్నీళ్లతో రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్.. ఏందిరయ్యా ఈ రచ్చ!
Manoj: మంచు మనోజ్, విష్ణుకి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. గతంలో మనోజ్ ఇంటికి కరెంట్ సరఫరా కట్ చేయడం, నీళ్ల మోటార్‌లో పంచదార వేయడం వంటివి విష్ణు చేస్తున్నాడని మనోజ్ ఆరోపించాడు. రీసెంట్‌గా తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్లి అక్కడ ఇద్దరి మధ్య ఘర్షన జరిగి కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. ఇక తాజాగా మనోజ్ ఉంటున్న ఇంట్లోకి ఎవరూ లేని సమయంలో విష్ణు తన మనుషులను పంపి.. తన చిన్న పాప నగలు, బట్టలు, భార్య కార్లను ఎత్తుకెళ్లారని మనోజ్ ఆరోపిస్తున్నారు. అసలు ఈ ఇద్దరూ చిన్నపిల్లల్లా రోడ్డుపైకి వచ్చి ఎందుకు గొడవలు పడుతున్నారో మీకు తెలుసా..

క్రమశిక్షణకు మారుపేరు అనే చెప్పుకునే నటుడు మంచు మోహన్‌బాబుకి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మీ, చిన్నకుమారుడు మనోజ్. ముగ్గురినీ చిన్నప్పటి నుంచి ఒకేలా చూస్తూ వచ్చారు మోహన్‌బాబు. అయితే.. గత కొంతకాలంగా విష్ణుకి, మనోజ్‌కి మధ్య విభేదాలు తలెత్తాయి. అవి కాస్త చినికిచినికి గాలివానలా మారాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ పంచాయతీ సోషల్‌మీడియాలో తారాస్థాయికి చేరుకోవడంతో మంచు మోహన్‌బాబు రంగ ప్రవేశం చేశారు.
Manoj Manchu
మనోజ్, విష్ణు మధ్య జరుగుతున్న గొడవలపై మోహన్‌బాబు మీడియా ముఖంగా ఎక్కడా మాట్లాడలేదు. అయితే.. పలుమార్లు లేఖలు విడుదల చేశారు. ఓసారి ఆడియో ఫుటేజ్ విడుదల చేశారు. అందులో మనోజ్‌ను మాత్రమే హెచ్చరిస్తూ.. నువ్వు చేస్తుంది తప్పు ఇది మంచి పద్దతి కాదని మందలించారు. కానీ విష్ణుని పల్లెత్తి మాటకూడా అనలేదు. దీంతో ఆయన వైఖరి ఎటువైపు ఉందో అందరికి తెలిసిపోయింది. అయితే... అసలు గొడవంతా ఆస్తుల గురించి కాదని మనోజ్ పదేపదే చెబుతున్నాడు.
Manoj Manchu
మంచు మనోజ్ చెబుతున్న ప్రకారం తన తండ్రి ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా తాను తీసుకోలేదని అంటున్నాడు. ఈ విషయం మోహన్‌బాబుకు ఎప్పుడో చెప్పినట్లు తెలిపారు. తన కష్టం మీద సినిమాలు చేసుకుంటూ కుటుంబాన్ని బతికించుకుంటానని చెబుతున్నారు మనోజ్. అయితే.. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు ఉంటున్న ఇంటిలో తనకు వాటా ఉందని అందులో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడు. కానీ ఈ విషయం దగ్గరే విష్ణు, మనోజ్ ఘర్షణ పడుతున్నట్లు సమాచారం.
Manoj Manchu
విష్ణు, మనోజ్ గతంలో చెరొక 20 మంది బౌన్సర్లను ఇంట్లో కాపలాగా పెట్టుకున్నారు. ఆ సమయంలో పెద్ద గొడవలు జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బౌన్సర్లు ఉండటానికి వీళ్లేదని చెప్పారు. ఆ తర్వాత విష్ణు నీటి ట్యాంకులో పంచదార వేశారని, తన ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేశాడని ఇలా చిన్ని పిల్లల్లా రోడ్లపైకి వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా మనోజ్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెళ్లి ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నాడు.
Manoj Manchu
ఏప్రిల్ 1వ తేదీ మనోజ్ కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్బంగా ఫ్యామిలితో జైపూర్ వెళ్లారు. ఆ సమయంలో విష్ణు మనుషులు తన ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న పిల్ల బట్టలు, భార్య దుస్తులు బంగారు నగలు ఎత్తుకెళ్లారని మనోజ్ చెబుతున్నాడు. ఈ విషయాన్ని అప్పుడే తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ రోజు రాజస్థాన్ నుంచి వచ్చి చూస్తే తన కారుని, భార్య కారుని కూడా ఇంటి బయట రోడ్డుపై వదిలేశారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కలుగుచేసుకుని తనకు న్యాయం చేయాలని మనోజ్ వేడుకున్నాడు. హైకోర్టులో కేసు నడుస్తున్నా.. విష్ణు ఆగడాలు సృతిమించుతున్నాయని ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అతను కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకు మనోజ్ రావడంతో ఏందిరయ్యా ఈ రచ్చ, పంచాయతీ మాకు అని ఈ ఘటనలు గమనిస్తున్న కొందరు చర్చించుకుంటున్నారు.