4 4 6 4 6... ఆండ్రీ రస్సెల్ ను రఫ్ఫాడించిన నికోలస్ పూరన్
IPL Nicholas Pooran vs Andre Russell: నికోలస్ పూరన్ 36 బంతుల్లో అజేయంగా 87 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడటంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని అందుకుంది. పూరన్ తన సునామీ ఇన్నింగ్స్ తో 2,000 ఐపీఎల్ పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో పూరన్ సిక్సర్ల మోత మోగిస్తూ ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ ను దంచికొట్టాడు.

Nicholas Pooran
Nicholas Pooran vs Andre Russell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో నికోలస్ పూరన్ అద్భుతమైన ఫామ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పరుగులు సునామీ తెచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న నికోలస్ పూరన్ గత సీజన్ లో దుమ్మురేపే ఇన్నింగ్స్ లను ఆడాడు.
ఐపీఎల్ 2025లో కూడా ఆరంభం నుంచే అదరిపోయే ఇన్నింగ్స్ లతో పరుగుల వరదపారిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మరో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. పురాన్ కేవలం 36 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అద్భుతమైన సిక్సర్లతో కేకేఆర్ బౌలింగ్ ను దంచికొట్టాడు.
Nicholas Pooran (Photo: IPL)
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత కోల్‌కతా బౌలింగ్ ఎంచుకోగా, లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ తో పాటు మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడారు. మార్ష్ 48 బంతుల్లో 81 పరుగుల తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. మార్క్రామ్ తన 28 బంతుల ఇన్నింగ్స్‌లో 47 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 10.2 ఓవర్లలో 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Nicholas Pooran. (Photo- IPL)
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ విధ్వంస సృష్టించాడు. తన వెస్టిండీస్ జట్టు ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ ను చీల్చిచెండాడాడు. ఈ ఆల్ రౌండర్ వేసిన ఒక ఓవర్లో పూరన్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కోల్‌కతా తరఫున లక్నో ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌ను రస్సెల్ బౌలింగ్ చేశాడు.
పురాన్ తన మొదటి బంతిని బౌండరీ మీదుగా ఫోర్ కొట్టాడు. రెండో బంతికి పరుగు రాలేదు.. కానీ, మూడవ బంతిని అద్భుతమైన ఫోర్ కొట్టాడు పూరన్. తర్వాతి బంతిని సిక్సర్ గా మలిచాడు. ఐదో బంతికి ఫోర్ వచ్చింది. ఈ ఓవర్ చివరి బంతిని మరో బిగ్ సిక్సర్ గా మలిచాడు. దీంతో రస్సెల్ వేసిన ఈ ఓవర్ లో మొత్తం 24 పరుగులు సాధించాడు నికోలస్ పూరన్.
రస్సెల్ బౌలింగ్ లో అదిరిపోయే సిక్సర్లు కొట్టిన నికోలస్ పూరన్ వీడియో ఇక్కడ చూడండి
Andre Russell (Photo: IPL/ BCCI)
అద్భుతమైన ఫామ్‌లో నికోలస్ పురాన్
ఈ ఐపీఎల్ సీజన్‌లో పూరన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా తుఫాను ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను 75 పరుగులు చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 70 పరుగులతో దుమ్మురేపాడు. పంజాబ్ కింగ్స్‌పై 44, ముంబై ఇండియన్స్‌పై 12 పరుగులు చేశాడు. ఇప్పుడు కోల్‌కతా బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ 87 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు.