MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Hyderabad Haleem : ఏమిటీ... ఒక్క నెలలోనే హైదరబాదీలు ఇంత హలీం తిన్నారా..!

Hyderabad Haleem : ఏమిటీ... ఒక్క నెలలోనే హైదరబాదీలు ఇంత హలీం తిన్నారా..!

హైదరాబాదీలకు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో మరోసారి బైటపడింది. కేవలం ఒక్క నెలలోనే నగరంలో హలీం విక్రయాలు ఊహించని స్థాయిలో జరిగాయి. యావత్ దేశాన్నే ఆశ్చర్యానికి గురిచేసేలా నగరంలో హలీం బిజినెస్ జరిగింది. పదువు, వందలు కాదు ఏకంగా వేలకోట్లను హలీం కోసం ఖర్చుచేసారు హైదరబాదీలు. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 09 2025, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Hyderabad Haleem

Hyderabad Haleem

Haleem : హైదరాబాద్ అనగానే ముందుగా ఘుమఘుమలాడే నాన్ వెజ్ వంటకాలే గుర్తుకువస్తాయి. సహజంగానే తెలంగాణ ప్రజలకు ముక్కలేనిదే ముద్ద దిగదు... ఇక హైదరాబాద్ లో అయితే నాన్ వెజ్ ప్రియుల సంఖ్య మరీ ఎక్కువ. ఈ నవాబుల నగరంలో మూడుపూటలు మాంసాహారం తినేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... నగరంలో ఏమూలకు వెళ్ళినా బిర్యానీ దొరుకుతుంది. కానీ ఓ నెలలో మాత్రం ఈ బిర్యానీని మరో నాన్ వెజ్ వంటకం వెనక్కినెడుతుంటుంది... ఎక్కడ చూసినా ఆ ఆహారమే కనిపిస్తుంది. చివరకు బిర్యాని అమ్మే హోటళ్లు సైతం దాన్ని అమ్ముతాయి... ఆ వంటకం ఏమిటో కాదు ఎంతో రుచికరమైన హలీం.  

రంజాన్ మాసంలో మాత్రమే లభించే హలీంను ఉపవాసదీక్ష చేపట్టే ముస్లింలే కాదు హిందువులు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. కేవలం ఒక్కనెల మాత్రమే ఈ హలీం విరివిగా లభిస్తుంది. దేశంలోని అన్నిప్రాంతాల్లోనూ ఇది లభించినా హైదరాబాదీ హలీం టేస్ట్ ఇంకెక్కడా రాదు. మరీముఖ్యంగా నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్స్ లభించే హలీం చాలా స్పెషల్... మెత్తటి హలీంకు నెయ్యి దట్టించి, దోరగా వేయించిన ఉల్లిపాయలు, డ్రైప్రూట్స్ వేసి ఇస్తారు... దాని రుచి అద్భుతం... మహాద్భుతం అంటారు. 

గత నెల మార్చిలో రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగాయి.  ఈ సందర్భంగా హైదరాబాద్ లో హలీం విక్రయాలు భారీగా జరిగాయి. కేవలం ఒక్క నెలలోనే రికార్డుస్థాయిలో హలీం అమ్మకాలు జరిగాయి. దేశమే ఆశ్చర్యపోయేలా హైదరాబాదీలు హలీం తిన్నారు...దీంతో పదులు, వందలు కాదు ఏకంగా వేలకోట్లలో బిజినెస్ జరిగింది. అంతేకాదు హలీం మరిన్ని రికార్డులు కూడా నెలకొల్పింది... వాటిగురించి తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Hyderabad Haleem

Hyderabad Haleem

హలీం అమ్మకాల్లో దేశంలోనే హైదరాబాద్ టాప్ : 
   
రంజాన్ మాసంలో ఉపవాసంచేసే ముస్లింలకు వెంటనే ఎనర్జీ ఇచ్చే వంటకం హలీం. మాంసాన్ని మెత్తగా ఉడికించి పేస్ట్ లా చేసి మసాలాలు దట్టించి ఈ హలీంను తయారుచేస్తారు. నోటికి రుచికరంగా ఉండటమే కాదు ఈజీగా జీర్ణమై వెంటనే శక్తిని ఇస్తుంది. అందువల్లే రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం హలీం తినేందుకు ఇష్టపడతారు.  

ఇక కేవలం ఒకేనెల లభించే హలీంను ముస్లింలే కాదు ఇతర మతాలవారు కూడా ఇష్టంగా తింటారు. హైదరాబాద్ లో అయితే సాయంత్రం అయ్యిందంటే చాలు హలీం బట్టిలచుట్టూ జనం గుమిగూడి కనిపిస్తారు... రంజాన్ నెలంతా ఇదే సీన్ కనిపిస్తుంది. హలీం ధర ఎంతున్నా సరే లెక్కచేయకుండా రుచి చేస్తుంటారు. దీంతో ఈ రంజాన్ నెలలో కేవలం హలీం అమ్మకాల ద్వారానే కోట్లలో బిజినెస్ జరుగుతుంది. 

గత మార్చి నెలంతా రంజాన్ ఉపవానదీక్షలు జరిగాయి. మార్చి 2న ప్రారంభమై మార్చి 31 రంజాన్ పండగతో ఉపవాసదీక్షలు ముగిసాయి. ఈ నెలంతా హలీం అమ్మకాలు జోరుగా సాగాయి... కేవలం హైదరాబాద్ నగరంలోనే ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల హలీం విక్రయాలు జరిగినట్లు అంచనా. దేశంలోని మరే నగరంలోనూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేవు... ఇలా హలీం అమ్మకాల్లో హైదరాబాద్ రికార్డుల మోత మోగించింది. 

33
Haleem

Haleem

హైదరాబాద్ హలీం రికార్డులు : 

రంజాన్ మాసంలో అంటే గత మార్చినెలలో హైదరాబాద్ లో ఏకంగా 6 వేలకు పైగా హలీం కేంద్రాలు వెలిసినట్లు సమాచారం. పిస్తా హౌస్, షా గౌస్, బావర్చీ, మెహఫిల్ వంటి పెద్ద రెస్టారెంట్లు వీటికి అదనం.   ఇలా నగరంలో ప్రతిరోజూ లక్షలాది కిలోల హలీం విక్రయాలు జరిగాయి... చిన్న విక్రయ కేంద్రాల్లో రోజుకు సగటున 100 నుండి 200 ప్లేట్లు, పెద్ద రెస్టారెంట్స్ లో 500 నుండి 1000 ప్లేట్ల హలీం విక్రయాలు జరిగాయి. 

నగరంలో హలీం ధర ఒక్కోచోట ఒక్కోలా ఉంది... కొన్ని రెస్టారెంట్లతో ఒక్కరు తినే సింగిల్ హలీం 300 ఉండగా ఫ్యామిలీ ప్యాక్ రూ.600 నుండి రూ.800 వరకు అమ్మారు. ఇలా రోజుకు రూ.30 నుండి రూ.35 కోట్ల వరకు హలీం వ్యాపారం జరిగిందని అంచనా. వారాంతాల్లో అంటే శుక్ర, శని, ఆదివారాల్లో హలీం అమ్మకాలు మరింత ఎక్కువగా జరిగేవని చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాతబస్తీతో పాటు మిగతా హైదరాబాద్ ప్రాంతంలో కంటే సైబరాబాద్ ప్రాంతంలో హలీం విక్రయాలు జోరుగా సాగాయి. 

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హలీంకు డిమాండ్ పెరిగిందని... 20 శాతం అధికంగా అమ్మకాలు జరిగినట్లు హైదరాబాద్ హోటల్ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కేవలం హోటల్స్ లోనే కాదు ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలో కూడా గత నెల హలీం ఆర్డర్లే ఎక్కువగా వచ్చాయట. ఇలా హైదరాబాద్ హలీం అమ్మకాల విషయంలో రికార్డులు బద్దలుకొట్టింది.  
 

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆహారం
హైదరాబాద్
తెలంగాణ
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image3
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved